ఈ ఆహారంతో కుంగుబాటుకు చెక్

న్యూయార్క్ : ఉరుకుల పరుగుల నేటి ప్రపంచంలో ఒత్తిడితో చిత్తయి సగటు జీవి కుంగుబాటుకు లోనవుతున్నాడు. డిప్రెషన్ వెంటాడుతుండటంతో పలువురిని శారీరక, మానసిక వ్యాధులు చుట్టుముడుతున్నాయి. యోగ, ధ్యానం, శారీరకంగా చురుకుగా ఉండటంతో పాటు మంచి ఆహారం తీసుకోవడం ద్వారా కుంగుబాటును అధిగమించవచ్చని నిపుణులు చెబుతున్నారు. డిప్రెషన్ ను దీటుగా ఎదుర్కోవడానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలో చూద్దాం..
పాలు : విటమిన్ డి లోపం, తగిన మోతాదులో లేకపోవడం డిప్రెషన్ కు దారితీస్తుందని పలు అథ్యయనాలు వెల్లడించాయి. విటమిన్ డీ-డిప్రెషన్ పేరుతో పబ్ మెడ్ జర్నల్ లో ప్రచురించిన అథ్యయనం తెలిపింది. సూర్యరశ్మి సోకేలా చూసుకోవడంతో పాటు విటమిన్ డి పుష్కలంగా లభించే పాలను తాగితే కుంగుబాటును నివారించవచ్చు.
నట్స్ : బాదం, జీడిపప్పు, పల్లీలు, ఆఫ్రికాట్ వంటి నట్స్ లో శరీరానికి మేలు చేసే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి మూడ్ ను మెరుగుపరచడమే కాకుండా వాటిలో ఉండే హెల్థీ ఫ్యాట్స్ ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
సీఫుడ్ : చేపలు, రొయ్యలు వంటి సీఫుడ్స్ లో లభించే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ శరీరంలో వాపు ప్రక్రియను నివారిస్తూ కుంగుబాటును దరిచేరనీయవు. డిప్రెషన్ చికిత్సలో ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ దీటుగా పనిచేస్తాయి.
బెర్రీస్ : బెర్రీస్ లో ఉండే యాంటీఆక్సిడెంట్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. గాబరా, కుంగుబాటుకు చికిత్సలో యాంటీఆక్సిడెంట్లు బాగా పనిచేస్తాయని తాజా అథ్యయనాల్లో వెల్లడైంది.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

