న్యూఢిల్లీ : కూరలు, చట్నీల్లో రుచి కోసం వేసే కరివేపాకుతో (Health Tips) అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు చేకూరతాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. కార్బోహైడ్రేట్లు, ఫైబర్, క్యాల్షియం, ఫాస్పరస్, ఐరన్ వంటి పోషకాలతో పాటు కరివేపాకులో ఏ, బీ, సీ, ఈ వంటి పలు విటమిన్లు ఉండటంతో శరీరానికి అవసరమైన షోషకాలను, శక్తిని అందిస్తాయి.
పలు రకాల క్యాన్సర్ల నుంచి అవి మనల్ని కాపాడతాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. కరివేపాకులో ఉండే ఫ్లేవనాయిడ్లు కలోన్ క్యాన్సర్‌ను నివారించడంలో సమర్ధవంతంగా పనిచేస్తాయని ఫార్మకాలజీ అండ్ టాక్సికాలజీ జర్నల్ పేర్కొంది. బ్రెస్ట్ క్యాన్సర్ కణాలు వృద్ధి చెందకుండా కరివేపాకు నిలువరిస్తుంది. ఫ్లేవనాయిడ్లతో పాటు క్యుర్సెటిన్, కాటెచిన్, రుటిన్, గ్యాలిక్ యాసిడ్ వంటి యాంటీఆక్సిడెంట్స్ కరివేపాకులో ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.
ఇక నిత్యం కరివేపాకును ఆహారంలో తీసుకుంటే కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్‌ను తగ్గించి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఎలుకలపై జరిపిన పరిశోధనలో ఈ విషయం నిగ్గుతేలిందని నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ స్టడీస్‌లో ప్రచురితమైన అధ్యయనం వెల్లడించింది. ఇక కరివేపాకుతో చేకూరే ఆరోగ్య ప్రయోజనాలు పరిశీలిస్తే..
క్యాన్సర్ల నుంచి రక్షణ
గుండెకు మేలు
మధుమేహ నియంత్రణ
బరువు తగ్గడం
మలబద్ధకం నివారణ
Read More