Chest pain | కొవిడ్ నుంచి కోలుకున్నవారిని వెంటాడుతున్న ఛాతీనొప్పి
యువతలో గుండె పోటు మరణాలు పెరుగుతున్న క్రమంలో తాజా అధ్యయనం కీలక అంశాలు వెల్లడించింది. కొవిడ్ నుంచి కోలుకున్న వారిలో దీర్ఘకాలం ఛాతీనొప్పి (Chest pain) వెంటాడుతోందని ఇది భవిష్యత్‌లో హృద్రోగాల ముప్పుకు సంకేతమని ఈ అధ్యయనం పేర్కొంది.
న్యూయార్క్ : యువతలో గుండె పోటు మరణాలు పెరుగుతున్న క్రమంలో తాజా అధ్యయనం కీలక అంశాలు వెల్లడించింది. కొవిడ్ నుంచి కోలుకున్న వారిలో దీర్ఘకాలం ఛాతీనొప్పి (Chest pain) వెంటాడుతోందని ఇది భవిష్యత్‌లో హృద్రోగాల ముప్పుకు సంకేతమని ఈ అధ్యయనం పేర్కొంది. ఇన్ఫెక్షన్ సోకిన ఆరు నెలల నుంచి ఏడాదిలోగా ఛాతీ నొప్పి బాధిస్తుందని అయితే ఈ రోగుల్లో గుండెపోటు, స్ట్రోక్ వంటి అంశాలను అధ్యయనం గుర్తించలేదని తెలిపింది.
ఈ లక్షణాలు తీవ్ర పరిణామాలకు దారితీస్తాయని ఇప్పటికిప్పుడు తేల్చిచెప్పలేమని అధ్యయన పరిశోధకురాలు, అమెరికాలోని సాల్ట్‌లేక్ ఇంటర్మౌంటెన్ హెల్త్‌కు చెందిన కార్డియోవాస్క్యులర్ ఎపిడెమాలజిస్ట్ హిదీ మే వెల్లడించారు. కార్డియోవాస్క్యులర్ వ్యవస్ధపై ఇన్ఫెక్షన్ ప్రభావం దీర్ఘకాలం కొనసాగుతుందని, స్వల్పకాలంలో వీటి పర్యవసానాలు గుర్తించడం కష్టమని దీర్ఘకాలం ఫాలోఅప్ అవసరమని చెప్పారు.
కొవిడ్ రోగుల్లో కార్డియోవాస్క్యులర్ లక్షణాలను పసిగట్టేందుకు 1,50,000 మంది రోగులపై పరిశోధన చేపట్టారు. ఇన్ఫెక్షన్ నుంచి కోలుకున్న తర్వాత దీర్ఘకాలం ఛాతీనొప్పి లక్షణాలు కొవిడ్ రోగులను వెంటాడాయని గుర్తించామని, ఇవి దీర్ఘకాలం కొనసాగవచ్చని, రాబోయే కార్డియోవాస్క్యులర్ కాంప్లికేషన్స్‌కు దీన్ని సంకేతంగా భావించవచ్చని మే పేర్కొన్నారు. న్యూ ఓర్లియాన్స్లో జరిగిన అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ 2023 శాస్త్రీయ సదస్సులో ఈ ఫలితాలను పరిశోధకులు సమర్పించారు.
Read More :
Health Tips | వేసవి తాపం నుంచి శరీరాన్ని రక్షించే ఈ పానీయాల గురించి మీకు తెలుసా..?
National Dentist Day | దంతాలను ఎవరూ…
Life style news | ఆ పని కోసం కృత్రిమ లూబ్రికెంట్స్ వినియోగం అంత మంచిది కాదట..!
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

