Life style news | ఆ పని కోసం కృత్రిమ లూబ్రికెంట్స్ వినియోగం అంత మంచిది కాదట..!
Life style news | నీరు, ఆహారం తర్వాత మనిషి జీవితంలో అత్యంత ప్రాముఖ్యం ఉన్నది శృంగారానికే. ఎందుకంటే శృంగారం సృష్టి కార్యం. అయితే, ఈ విషయంలో చాలా మంది చాలా రకాల సమస్యలు ఎదుర్కొంటుంటారు. పురుషుల్లో ఇలాంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి.
నీరు, ఆహారం తర్వాత మనిషి జీవితంలో అత్యంత ప్రాముఖ్యం ఉన్నది శృంగారానికే. ఎందుకంటే శృంగారం సృష్టి కార్యం. అయితే, ఈ విషయంలో చాలా మంది చాలా రకాల సమస్యలు ఎదుర్కొంటుంటారు. పురుషుల్లో ఇలాంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. అంగస్తంభన, శీఘ్ర స్కలనం లాంటి సమస్యలు ప్రధానంగా వినిపిపిస్తాయి. మహిళల్లో ముఖ్యంగా మోనోపాజ్ దశలో ఉన్న మహిళల్లో సహజ లూబ్రికెంట్స్ విడుదల కావు. దానివల్ల ఆ సమయంలో వారు తీవ్రమైన నొప్పిని అనుభవించాల్సి వస్తుంది. ఈ సమస్య నుంచి ఉపశమనం కోసం కృత్రిమ లూబ్రికెంట్స్‌ను వాడుతుంటారు. కానీ అది ప్రమాదకరమని గైనకాలజీ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఎందుకు ప్రమాదమంటే..
పెట్రోలియం జెల్లీ..
చాలా మంది దంపతులు ఆ సమయంలో నొప్పిగా ఉంటుందని ఉపశమనం కోసం పెట్రోలియం జెల్లీని వినియోగిస్తుంటారు. అయితే, ఇలా చేయడం కరెక్టు కాదంటున్నారు నిపుణులు. పెట్రోలియం జెల్లీవల్ల స్త్రీ జననాంగాల్లో బ్యాక్టీరియా వృద్ధి చెందుతుందని, ఇది సుఖవ్యాధులకు దారితీసే ప్రమాదం ఉందని చెబుతున్నారు.
మీగడ లాంటి జారుడు పదార్థాలు..
మరికొందరు మీగడ లాంటి జారుడు పదార్థాలను కృత్రిమ లూబ్రికెంట్స్‌గా ఉపయోగిస్తుంటారు. ఇలాంటి పదార్థాల వినియోగం కూడా ఆరోగ్యానికి అనర్థమేనని నిపుణులు చెబుతున్నారు. కృత్రిమ లూబ్రికెంట్స్‌గా రకరకాల జారుడు పదార్థాలను వినియోగించడంవల్ల స్త్రీ, పురుష జననేంద్రియాల్లో ఇన్ఫెక్షన్లు సోకుతాయని హెచ్చరిస్తున్నారు.
బాడీ లోషన్, ఆలివ్ ఆయిల్..
అదేవిధంగా ఆ సమయంలో నొప్పి రాకుండా ఉండేందుకు ఇంకొంత మంది కాస్మటిక్ బాడీ లోషన్‌ను కృత్రిమ లూబ్రికెంట్‌గా వాడుతుంటారు. అది కూడా అసహజమైన పద్ధతేనని గైనిక్ నిపుణులు చెబుతున్నారు. మరికొందరు ఆలివ్ ఆయిల్‌ను ఆర్టిఫిషియల్ లూబ్రికెంట్‌గా వినియోగిస్తారని అది కూడా అంత శ్రేయస్కరం కాదని హెచ్చరిస్తున్నారు.
ఏమిటి పరిష్కారం..?
సహజంగా స్త్రీ జననాంగాల్లో విడుదలయ్యే సహజ లూబ్రికెంట్స్తోనే శృంగారాన్ని ఎంజాయ్ చేయాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. మోనోపాజ్ దశలో ఉన్నవాళ్లు సమస్య పరిష్కారం కోసం లూబ్రికెంట్స్‌గా కండోమ్స్ వాడాలని, వాటిలో ఉండే లేటెక్స్ పదార్థం కృత్రిమ లూబ్రికెంట్‌గా ఉపయోగపడుతుందని చెబుతున్నారు. అదేవిధంగా గర్భనిరోధక నియమాలను పాటించేవారు కూడా జెల్లీలు, లోషన్ల జోలికి వెళ్లకుండా కండోమ్స్ వాడటమే ఉత్తమమని సలహా ఇస్తున్నారు.
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | ‘రణబాలి’ మిక్స్డ్ టాక్.. ‘ఫౌజీ’తోనైనా ప్రభాస్ కొత్త ట్రెండ్ సృష్టిస్తారా?
Dorothy OTT | ఓటీటీలోకి కీర్తి సురేష్ ‘డోరతి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
Bear attacks | తంగేడు పువ్వు కోసం వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి.. తీవ్ర గాయాలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

