హైదరాబాద్: మనం తినే ఆహారపదార్థాలు అన్నీ ఏదో రకంగా ఆరోగ్యానికి మేలు చేసేవే ఉంటాయి. అయితే, కొన్ని రకాల పదార్థాలతో ప్రయోజానాలు ఎక్కువగా ఉంటే, మరికొన్ని రకాల పదార్థాలతో తక్కువ ఆరోగ్య ప్రయోజనం ఉంటుంది. అధికంగా ఆరోగ్య ప్రయోజనాలున్న ఆహార పదార్థాల్లో మాత్రం కోడిగుడ్డు ముందు వరుసలో ఉంటుంది. మనం రోజుకొక ఉడుకబెట్టిన కోడిగుడ్డు తింటే ఆరోగ్యపరంగా ఎన్నో లాభాలుంటాయి. అవేంటో తెలుసుకుందామా మరి..