Smart Phones Usage | స్మార్ట్ ఫోన్లు అనేవి ప్రస్తుతం మన నిత్య జీవితంలో భాగం అయిపోయాయి. ఇంకా చెప్పాలంటే అవి మన నిత్యావసర వస్తువుగా మారాయి. ఫోన్లు లేకపోతే ఈ ప్రపంచాన్ని అసలు ఊహించుకోలేం అన్నంతగా పరిస్థితి మారింది. చాలా పనులను మనం ఫోన్లతో చక్కబెట్టుకుంటున్నాం. ఇప్పుడు 5జి అందుబాటులో ఉండడంతో చాలా వేగంగా అనేక పనులను చేసుకోగలుగుతున్నాం. అయితే అంతా బాగానే ఉంది కానీ ఫోన్లను వాడడంలోనే అసలు సమస్యంతా ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఫోన్లను ఎక్కడ పడితే అక్కడ పెట్టి ఉపయోగించకూడదని వారు హెచ్చరిస్తున్నారు. ఫోన్లను చాలా మంది అసలు ఏయే ప్రదేశాల్లో పెడుతుంటారు.. ఎలా వాడుతుంటారు.. వాటి వల్ల మనకు ఎలాంటి హాని కలుగుతుంది.. అన్న వివరాలను వైద్యులు తెలియజేస్తున్నారు.
చాలా మంది ఫోన్లను చార్జింగ్ పెట్టి వాటిని కింద పెట్టేందుకు టేబుల్, స్టూల్ లాంటిది ఏదీ లేదని చెప్పి వాటిని చార్జర్పైనే పెడతారు. కానీ ఇలా చేయరాదు. దీని వల్ల రేడియేషన్ బాగా వస్తుందని వైద్యులు అంటున్నారు. కనుక ఫోన్లను చార్జింగ్ పెట్టినప్పుడు వాటిని చార్జర్లపై ఉంచరాదు. అలాగే ఓవర్ నైట్ చార్జింగ్ కూడా ఫోన్లను పెట్టరాదు. దాని వల్ల ఫోన్లు పేలిపోయే ప్రమాదం ఉంటుంది. అలాగే చాలా మంది దిండు కింద ఫోన్లను పెట్టి నిద్రిస్తారు. ఇలా చేయకూడదు. ఇలా చేస్తే శరీరంలో మెలటోనిన్ ఉత్పత్తి తగ్గిపోతుంది. పలు అనారోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా చర్మ సమస్యలు వస్తాయి. కనుక నిద్రించేటప్పుడు ఫోన్లను దిండ్ల కింద అస్సలు పెట్టరాదు.
అమ్మాయిలకు ఎక్కువగా ఫోన్లను వెనుక జేబులో పెట్టుకునే అలవాటు ఉంటుంది. కానీ ఇలా చేయడం వల్ల ఫోన్ నుంచి వచ్చే రేడియేషన్ కడుపు నొప్పి, కాళ్ల నొప్పిని కలిగిస్తుంది. కనుక ఫోన్లను బ్యాక్ పాకెట్లలో పెట్టరాదు. అలాగే పురుషులు ఎక్కువగా ఫోన్లను ప్యాంటు ముందు జేబులో పెడతారు. ఇలా చేస్తే ఫోన్ల నుంచి వచ్చే రేడియేషన్ వల్ల వీర్య కణాలు నాశనం అవుతాయి. దీంతో సంతానం కలిగేందుకు అవకాశం తక్కువగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. అలాగే చాలా మంది నిద్రించేటప్పుడు తల పక్కన ఫోన్లను పెట్టి పడుకుంటారు. ఇలా చేయడం వల్ల ఫోన్ నుంచి విపరీతమైన రేడియేషన్ వస్తుంది. ఇది మెదడుపై ప్రభావం చూపిస్తుంది. దీని వల్ల మెదడులో కణతులు ఏర్పడే అవకాశం ఉంటుంది. అది బ్రెయిన్ ట్యూమర్‌కు దారి తీయవచ్చని వైద్యులు చెబుతున్నారు.
ఇక చాలా మంది ఫోన్‌ను చార్జింగ్ పెట్టినా కూడా ఏదైనా కాల్ లేదా మెసేజ్ వస్తే చార్జింగ్ అలాగే ఉంచి దాన్ని ఉపయోగించుకుంటారు. ఇలా కూడా చేయకూడదు. ఇది అత్యంత ప్రమాదకరం. దీని వల్ల ఫోన్ అధికంగా రేడియేషన్, హీట్‌కు గురై త్వరగా పేలిపోయే ప్రమాదం ఉంటుంది. అలాగే ఫోన్లకు కంపెనీలు ఇచ్చిన చార్జర్లనే ఎల్లప్పుడూ ఉపయోగించాలి. అలా కుదరకపోతే ఫోన్‌కు ఉన్న చార్జింగ్ కెపాసిటీకి సరిపోయే చార్జర్‌ను ఉపయోగించాల్సి ఉంటుంది. అలాగే ఫోన్‌ను చార్జింగ్ చేసిన అనంతరం కచ్చితంగా చార్జర్ ఉన్న స్విచ్ ను ఆఫ్ చేయాలి. ఈ విధంగా పలు సూచనలు పాటిస్తే ఫోన్లను జాగ్రత్తగా ఉపయోగించుకోవచ్చు. సురక్షితంగా ఉండవచ్చు.