పుట్టుమచ్చలో మార్పులు క్యాన్సర్‌కు సంకేతం
పుట్టుమచ్చ రంగు మారినా, చర్మం ఉబ్బినట్టుగా, వాచినట్టు అనిపించినా వెంటనే పరీక్షలు చేయించుకోవాలి.

ABCDE పద్ధతిద్వారా గుర్తించండి :
గత సంచికలో క్యాన్సర్‌ను ముందస్తుగా గుర్తించడానికి సంబంధించి స్త్రీలలో నిర్వహించవలసిన స్క్రీనింగ్ టెస్ట్‌లు తెలుసుకున్నాం. ఇప్పుడు స్త్రీ, పురుషులిరువురు, మరియు పురుషులు మాత్రమే చేయించుకోవలసిన పరీక్షల గురించి తెలుసుకుందాం. చర్మ క్యాన్సర్, నోటి క్యాన్సర్, పెద్దపేగులలో క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్లను ముందుగానే ఎలా గుర్తించవచ్చో తెలుసుకుందాం.
స్త్రీ పురుషులిరువురు చేయించుకోవాల్సినపరీక్షలు
చర్మ క్యాన్సర్ : చర్మ క్యాన్సర్‌ను గుర్తించడానికి ముఖ్యమైన పద్ధతి చర్మాన్ని తరచుగా పరిశీలించడమే! ముఖ్యంగా పుట్టుమచ్చలని ఈ కింద పేర్కొన్న ABCDE పద్ధతి ప్రకారం పరీక్షించుకోవడం మంచిది.
ABCDE పద్ధతి
A : పుట్టుమచ్చలను మధ్యగా విభజించి చూసినప్పుడు రెండు అర్ధభాగాలు ఒకేలా ఉండకూడదు.
B : పుట్టుమచ్చ అంచులు పలుచని రంగులో (Blurr) లేదా రఫ్‌గా ఉండకూడదు.
C : పుట్టుమచ్చ రంగులో మార్పు రాకూడదు. అంటే, అవి మొదట ఉన్న రంగుకంటే ముదురు రంగులోకి మారటం లేదా పలుచబడటం కాకూడదు.
D : పుట్టుమచ్చ వ్యాసం 1/4 అంగుళం కన్నా ఎక్కువ ఉండకూడదు.
E : పుట్టుమచ్చ చర్మం మీద ఉబ్బెత్తుగా, వాచినట్లుగా ఉండటం.
- పెద్దపేగులలో క్యాన్సర్
- పెద్దపేగులలో క్యాన్సర్ అనేది మొదట చిన్నగుల్లలుగా మొదలై క్రమంగా క్యాన్సర్ కణుతులుగా మారే అవకాశం ఉంది. ఈ కింద పేర్కొన్న లక్షణాలు కనిపించినప్పుడు అశ్రద్ధ చేయకుండా వెంటనే తగిన చర్యలు చేపట్టాలి.
- మలద్వారం వద్ద రక్తస్రావం, మలంలో రక్తం పడటం.
- డయేరియా, మలబద్ధకం మొదలైనవి వారాల తరబడి కొనసాగడం.
- పొత్తికడుపు భాగంలో నొప్పి లేదా పట్టేసినట్లు ఉండటం.
- ఆకస్మికంగా బరువు తగ్గడం.
- ఇంతకు ముందు క్యాన్సర్ వచ్చి తగ్గడం.
- అల్సరేటివ్ కొలైటిస్ ఉండటం.
- రక్త సంబంధీకులలో (తల్లిదండ్రులు, సోదరి, సోదరులు, పిల్లలు) ఎవరికైనా క్యాన్సర్ ఉండటం.
- పైన పేర్కొన్న సందర్భాల్లో ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి FOBT మరియు ఫ్లెక్సిబుల్ సిగ్మాయిడో స్కోపీ పరీక్షలు చేయించుకోవాలి.
నోటి క్యాన్సర్
నోటి క్యాన్సర్ ఎక్కువగా ఉన్న మనలాంటి దేశాలలో నోటి క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది ఎంతో ముఖ్యం. మిగతా శరీర భాగాలలాగా కాకుండా నోరు అనేది కంటికి కనపడేది కాబట్టి, ప్రాథమిక స్క్రీనింగ్ అనేది సులువు. నోటిలో కలిగే మార్పులను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. ముఖ్యంగా పొగాకు నమిలే అలవాటు ఉన్నవారు వెంటనే దానిని మానుకోవాలి. పొగాకు అలవాటు ఉండీ మానేసిన వారుకూడా నోటిలో కలిగే మార్పులను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి.
మగవారికి నిర్వహించాల్సిన స్క్రీనింగ్ పరీక్షలు
ప్రోస్టేట్ క్యాన్సర్: మగవారికి వచ్చే క్యాన్సర్లలో ప్రోస్టేట్ క్యాన్సర్కూడా ఒకటి. భారతదేశంలో ప్రోస్టేట్ క్యాన్సర్ అసహజమేమీ కాదు, కానీ చాలామందికి దీనిపై అవగాహన లేదు.
అనేక అంతర్జాతీయ సంస్థలుకూడా మగవారు రెగ్యులర్‌గా ప్రోస్టేట్ స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలని సలహా ఇస్తున్నాయి. 50 సంవత్సరాలు నిండిన మగవారు ప్రతి సంవత్సరం ప్రోస్టేట్ ఆంటిజన్ (PSA) రక్త పరీక్ష, డిజిటల్ రెక్టల్ పరీక్ష చేయించుకోవాలి. కుటుంబంలో ఎవరికైనా (తండ్రి, సోదరుడు, కొడుకు) ప్రోస్టేట్ క్యాన్సర్ ఉన్నట్లయితే మిగతా మగవారు 40 సంవత్సరాల వయసునుంచే ప్రోస్టేట్ స్క్రీనింగ్
చేయించుకోవాలి.
డాక్టర్ మోహనవంశీ
చీఫ్ సర్జికల్ ఆంకాలజిస్ట్, ఒమేగా హాస్పిటల్స్
హైదరాబాద్: 9848011421
కర్నూల్: 08518-273001
గుంటూర్: 0863-2223300
Read Today's Latest Health News in Telugu and Telugu News
- Tags
- Cancer
- skin cancer
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas Birthday | ప్రభాస్ బర్త్‌డే కానుక.. థియేటర్లలో సందడి చేయనున్న డార్లింగ్ బ్లాక్‌బస్టర్ మూవీస్ ‘వర్షం’, ‘ఛత్రపతి’!
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

