న్యూఢిల్లీ : ఉరుకుల పరుగుల జీవితంలో దాదాపుగా ప్రతి ఒక్కరినీ ఒత్తిడి (Health Tips) చిత్తు చేస్తోంది. ఒత్తిడి తొలుత మానసికంగా అలజడి రేపినా క్రమంగా శారీరక ఆరోగ్యాన్నీ ప్రభావితం చేస్తుంది. తాము ఒత్తిడితో సతమతమవుతున్నామని తెలియని వారు దాని ప్రభావంతో శారీరక సమస్యలను ఎదుర్కోవడంతో పాటు బరువులో హెచ్చుతగ్గులూ బయటపడుతుంటాయి.
స్ట్రెస్ నుంచి బయటపడేందుకు నిత్యం వ్యాయామం, యోగా, ధ్యానం ఉపకరిస్తాయని నిపుణులు చెబుతున్నారు. శారీరక వ్యాయామంతో పాటు నిత్యం మెడిటేషన్ ద్వారా స్ట్రెస్‌ను అధిగమించవచ్చు. అసలు మనం ఒత్తిడికి లోనవుతున్నామా లేదా అనేది కొన్ని లక్షణాల ద్వారా గుర్తించవచ్చని వెల్నెస్ నిపుణులు కైలీ ఎవనీర్ వెల్లడించారు.
అజీర్ణం, ఆకలి లేకపోవడం, నిద్రలేమి, అధికంగా ఆహారం తీసుకోవాలని అనిపించడం, బరువులో హెచ్చతగ్గులు, రుతుక్రమంలో ఇబ్బందులు వంటి లక్షణాలు మనం స్ట్రెస్ బారినపడితే కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు.
Read More
Loneliness | మీలో ఈ 12 లక్షణాలు ఉన్నాయా? అయితే మీరు ఒంటరితనంతో బాధపడుతున్నట్లే !