Sandeep | మెగాస్టార్ చిరంజీవి హీరోగా గతంలో వచ్చిన బ్లాక్‌బస్టర్ చిత్రం ‘వేట’ టైటిల్‌తో ఇప్పుడు మరో సినిమా తెరకెక్కుతోంది. అయితే ఈసారి కథ పూర్తిగా విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగనుంది. ‘కమిటీ కుర్రోళ్లు’ సినిమాతో హీరోగా గుర్తింపు తెచ్చుకున్న సందీప్ సరోజ్, సాత్విక జంటగా నటిస్తున్న ఈ చిత్రం సోమవారం పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. ఈటీవీ విన్, ఎస్ఆర్డీ ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఫణి అడపాక, జయలక్ష్మి అడపాక నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాతో అశోక్ కోటిపల్లి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు హాజరై చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు.
ముహూర్తపు సన్నివేశానికి నాగబాబు స్క్రిప్ట్ అందించగా, కేఎస్ రవికుమార్ క్లాప్ కొట్టారు. సాయి రాజేష్, ఎస్కేఎన్, వీఎన్ ఆదిత్య, ఫణి అడపాక కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఈ సందర్భంగా చిత్రబృందం సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది.‘వేట’ టైటిల్‌ను ప్రకటిస్తూ మేకర్స్ ఇచ్చిన వివరణ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. “వేట ఇప్పుడే ప్రారంభమైంది.. గోదావరి నదీ గర్భం నుంచి వెలువడిన ఒక అజ్ఞాత గాథ” అంటూ ఈ సినిమాను పరిచయం చేశారు. దీంతో గోదావరి ప్రాంతానికి సంబంధించిన ఓ ఆసక్తికరమైన కథను దర్శకుడు తెరపైకి తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది.
హీరో సందీప్ సరోజ్ మాట్లాడుతూ.. చిరంజీవి నటించిన ‘వేట’ టైటిల్ తమ కథకు ఎంతో యాప్ట్‌గా ఉంటుందని తెలిపారు. ‘కమిటీ కుర్రోళ్లు’తో ప్రేక్షకులకు పరిచయమైన తనకు ఈ సినిమా మరో మంచి అవకాశంగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సినిమా ప్రారంభోత్సవానికి వచ్చిన నాగబాబుతో పాటు చిత్రబృందంలోని ప్రతి ఒక్కరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.హీరోయిన్ సాత్విక మాట్లాడుతూ.. ఈ సినిమాతో తన కెరీర్‌కు మంచి ఆరంభం లభిస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. తనపై నమ్మకం ఉంచి అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు తెలిపారు. ‘వేట’ సినిమాతో అశోక్ కోటిపల్లి దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. కథ చెప్పిన వెంటనే కేఎస్ రవికుమార్ ఈ ప్రాజెక్ట్‌కు అంగీకరించారని దర్శకుడు తెలిపారు. తన తొలి సినిమాకు అవకాశం ఇచ్చిన నిర్మాతలకు, ఈటీవీ విన్ టీమ్‌కు కృతజ్ఞతలు చెప్పారు. ఈ చిత్రంలో సందీప్ సరోజ్, సాత్వికతో పాటు కేఎస్ రవికుమార్, రాజీవ్ కనకాల, రఘుబాబు, రవీంద్ర విజయ్, ప్రభావతి, ప్రమోదిని, వికాస్ వశిష్ట తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.