ఊబకాయాన్ని వదిలించుకోవాలనుకునే వారికి టమాట తిరుగులేని ఆహారం. నిక్షేపంగా డైట్లో భాగం చేసుకోవచ్చు. ఎందుకంటే టమాటలో కేలరీలు తక్కువ. ఓ పెద్ద టమాటలో ముప్పై మూడు కేలరీలు మాత్రమే ఉంటాయి.
ఇందులోని ఫైబర్ జీర్ణ వ్యవస్థకు మేలు చేస్తుంది. కడుపులో చెత్తాచెదారం పేరుకుపోకుండా కాపాడుతుంది. ముఖ్యంగా డైటరీ ఫైబర్ పొట్టచుట్టూ తిష్టవేసిన చెడు కొవ్వును కరిగిస్తుంది. టమాటను సలాడ్‌లా ఆరగించవచ్చు, జ్యూస్‌గా తాగొచ్చు, సూప్‌లా వండుకోవచ్చు.