ఈ ఐదు అలవాట్లతో దీర్ఘాయువు

న్యూయార్క్ : ఎలాంటి అనారోగ్యం లేకుండా నిండు నూరేండ్లు పంతోషంగా జీవించాలని అనుకోని వారుండరు. ఉరుకుల పరుగుల జీవితం, ఒత్తిళ్ల నడుమ యాభై ఏండ్లు రాకముందే వ్యాధులు, నిస్సత్తువ మీదపడుతున్నాయి. యాభై ఏండ్ల వయసు వచ్చినప్పటి నుంచి ఐదు ఆరోగ్యకరమైన అలవాట్లను పాటిస్తే చాలా కాలం పాటు ఎలాంటి వ్యాధుల బారినపడకుండా ఉండటంతో పాటు దీర్ఘాయువును పొందవచ్చని హార్వర్డ్ అథ్యయనం వెల్లడించింది.
మధ్యవయసులో ఈ ఐదు అలవాట్లను అలవరుచుకుంటే చాలా ఏండ్ల పాటు టైప్ 2 మధుమేహం, గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి తీవ్ర అనారోగ్యాలకు గురికాకుండా ఉండవచ్చని హార్వర్డ్ టీహెచ్ చాన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ నిర్వహించిన తాజా అథ్యయనం తేల్చింది. ఈ స్టడీ వివరాలు బీఎంజేలో ఆన్లైన్ లో ప్రచురితమయ్యాయి. ఆరోగ్యకరమైన ఈ ఐదు అలవాట్లతో మనిషి జీవిత కాలం పెంచుకోవచ్చని వెల్లడైందని పరిశోధకులు పేర్కొన్నారు. ఆరోగ్య కరమైన అలవాట్లను చూద్దాం..
ఆరోగ్యకరమైన ఆహారం : గుండె జబ్బులు, ఒబెసిటీ, కొవ్వు పేరుకుపోవడం వంటి అనారోగ్యాలకు దారితీసే పరిస్థితిని ఆరోగ్యకరమైన ఆహారంతో నియంత్రించవచ్చు. సమతుల ఆహారాన్ని మితంగా, శుచిగా తీసుకోవాలి. ఆహారంలో పోషకాలన్నీ లభించేలా చూసుకోవాలి.
వ్యాయామం : శారీరక, మానసిక ఆరోగ్యానికి వ్యాయామం కీలకం. దీంతో పాటు రోజును ఉత్సాహంగా, ఆహ్లాదంగా గడిపేందుకూ వ్యాయామం ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది. వ్యాయామంతో బరువు తగ్గడం ద్వారా పలు వ్యాధుల ముప్పును తప్పించుకోవచ్చు.
బరువు నియంత్రణ : అధిక బరువు గుండె జబ్బులు, రక్తపోటు, మధుమేహం వంటి పలు వ్యాధులకు దారితీసే ముప్పు ఉండటంతో ఆరోగ్యకరమైన బరువును ఎప్పటికీ మెయింటెన్ చేస్తుండాలి. బీఎంఐ 18.5 నుంచి 25కు మించకుండా చూసుకోవాలి.
ఆల్కహాల్ కు దూరం : మద్యం మితంగా తీసుకోకుండా మితిమీరితే శరీరం వ్యాధులకు నిలయమవుతుంది. రోజుకు గ్లాసుకు మించి మద్యం తీసుకుంటే శరీరాన్ని వ్యాధులకు మనమే దగ్గర చేసిన వారం అవుతాం.
స్మోకింగ్ కు చెక్ : పొగతాగడం ఆరోగ్యానికి ప్రమాదకరమని నిపుణులు ఎప్పటి నుంచో హెచ్చరిస్తున్నారు. స్మోకింగ్ తో క్యాన్సర్, గుండె జబ్బులు, ఊపిరితిత్తుల వ్యాధులు, మధుమేహం, శ్వాసకోశ వ్యాధుల ముప్పు ఉందని అమెరికన్ సీడీసీ హెచ్చరిస్తోంది. స్మోకింగ్ కు దూరం కావడం ద్వారా పలు వ్యాధుల బారినపడకుండా ఆరోగ్యం కాపాడుకోవచ్చు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Leaders | పౌరులపై మోదీ ప్రభుత్వం యుద్ధం చేస్తోంది.. ఇది బహిరంగ ఎమర్జెన్సీ.. సీజేపీ నేతల ఆరోపణ
Hurricane Isaias | అమెరికాను అతలాకుతలం చేసిన హరికేన్ ఇసైయాస్.. టోర్నడో ముప్పు ఉందని హెచ్చరిక..!
Assaulting CJP Protesters | సీజేపీ నిరసనకారులపై ‘హిందూ రక్షా దళ్’ వ్యక్తులు దాడి.. నలుగురు అరెస్ట్
Assam Girl | ఆగస్టులో డ్యాన్స్ ట్రూప్‌తో కలిసి ఇక్కడికొచ్చారు.. అసోం యువతి హిమ శ్రీ బోరా మృతిపై పోలీసులు ఏమన్నారంటే..?
Kiara Advani | రెండో ప్రెగ్నెన్సీ జోష్.. వెకేషన్ ఫొటోలతో మెరిసిపోతున్న కియారా అద్వానీ!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

