Apps:
Follow us on:

Parenting Tips | పిల్లలకు పొద్దున ఎలాంటి ఆహారం తినిపించాలి?

1/6Parenting Tips | చాలామంది పిల్లలు లేవగానే ఆకలేస్తుందని అంటుంటారు. అయితే అంత పొద్దున వంట చేయడం కుదరక.. పేరెంట్స్‌ ఏ బిస్కెట్‌ ప్యాకెటో.. చిప్స్‌ ప్యాకెటో ఇచ్చి వాళ్ల కడుపు నింపుతారు. ఆ తర్వాత నెమ్మదిగా వంట చేసి పెడుతుంటారు. కానీ అలా ఆలస్యంగా అల్పాహారం తినిపించినా.. జంక్‌ఫుడ్‌ అలవాటు చేసినా ఆరోగ్యానికి నష్టమైనని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఏ సమయంలో ఏ అల్పాహారం తినిపిస్తే మంచిదో సలహాలు కూడా ఇస్తున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం..
2/6పిల్లలకు ఉదయం 8 గంటల్లోపే అల్పాహారం అందించాలి. రాత్రి చాలాసేపు పడుకోవడం వల్ల పొద్దున లేచేసరికి కడుపులో ఏమీ ఉండదు. కాబట్టి ఉదయం త్వరగా అలసిపోతారు. అందుకే పొద్దున వీలైనంత త్వరగా అల్పాహారం పెడితే మంచిది.
3/6ఉదయం పూట ఎట్టి పరిస్థితుల్లో జంక్ ఫుడ్ తినిపించకూడదు. ఇడ్లీ, దోశ, కిచిడీ వంటివి తినిపించాలి. మినుపప్పుతో చేసే ఇడ్లీ, దోశ వంటి అల్పాహారం పెట్టేటప్పుడు కొబ్బరి చట్నీ చేసి పెడితే మంచిది. అదనంగా పిల్లలకు ఇందులో శక్తి లభిస్తుంది.
4/6తప్పనిసరిగా ఉదయం పిల్లలకు పండ్లు ఇవ్వాలి. పొద్దున పూట ఎక్కువగా నూనె వస్తువులు ఇవ్వకపోవడమే మంచిది. పూరీ, వడ వంటి ఆహారపదార్థాలు ఉదయం తినిపించవద్దు. నూనె అజీర్తిని పెంచుతుంది.
5/6వారంలో కనీసం నాలుగు రోజులు ఆకుకూరలతో భోజనం అందిస్తే పిల్లలు ఆరోగ్యంగా ఉండేందుకు అవకాశం ఉంటుంది. పప్పు దినుసులు, సీజనల్ పండ్లు ఇవ్వడం వల్ల పిల్లల్లో శారీరక ఎదుగుదల ఉంటుంది.
6/6స్కూల్స్‌కి వెళ్లేటప్పుడు కూడా స్నాక్స్‌గా పండ్లు, కూరగాయల ముక్కలు, బీట్‌రూట్, క్యారెట్ ముక్కలు బాక్స్‌లో పెట్టి పంపించాలి. వీటిలో పీచు పదార్థం ఉండటం వల్ల శరీరానికి కావాల్సిన విటమిన్లు అందుతాయి. ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. మలబద్దకపు సమస్యలు కూడా దరిచేరవు.