Health Tips | జీర్ణక్రియ సాఫీగా సాగాలంటే యాపిల్‌ను ఎలా తీసుకోవాలంటే..!
Health Tips : రోజుకో యాపిల్ తింటే వైద్యుడి అవసరం ఉండదని చెబుతుంటారు. రోజూ యాపిల్ తీసుకుంటే పలు రకాల అనారోగ్య సమస్యలకు దూరం కావచ్చని అధ్యయనాలూ వెల్లడించాయి.
Health Tips : రోజుకో యాపిల్ తింటే వైద్యుడి అవసరం ఉండదని చెబుతుంటారు. రోజూ యాపిల్ తీసుకుంటే పలు రకాల అనారోగ్య సమస్యలకు దూరం కావచ్చని అధ్యయనాలూ వెల్లడించాయి. సిమ్లా యాపిల్స్ నుంచి కశ్మీర్ ఆర్చర్డ్స్ వరకూ ఇప్పుడు ఎన్నో రకాల యాపిల్స్ అందుబాటులో ఉన్నాయి. యాపిల్స్‌లో ఫైబర్, విటమిన్ సీతో పాటు యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండటంతో ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
యాపిల్ తీసుకోవడం ద్వారా శారీరక ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా జీర్ణక్రియ సాఫీగా సాగేందుకు ఇవి ఉపకరిస్తాయి. అయితే జీర్ణ సంబంధ సమస్యలతో బాధపడేవారు వారి సమస్యల ఆధారంగా యాపిల్‌ను వేర్వేరు పద్ధతుల్లో తీసుకుంటే మేలుచేస్తుందని న్యూట్రిషనిస్ట్ దీప్సికా జైన్ చెబుతున్నారు.
మలబద్ధకంతో బాదపడేవారు యాపిల్‌ను తొక్కతో సహా తీసుకోవాలి. యాపిల్‌పై ఉండే తొక్కలో ఫైబర్ అధికంగా ఉండటంతో ప్రేవుల కదలికలను మెరుగుపరిచి మలం మెత్తగా తయారయ్యేలా చేస్తుంది. ఇక విరేచనాలతో బాధపడేవారు యాపిల్ తోలు లేకుండా లోపలి పల్ప్ తీసుకోవాలి. ఇలా తీసుకుంటే డయేరియా తగ్గుముఖం పడుతుంది. ప్రేవుల ఆరోగ్యం మెరుగుపడాలని కోరుకునే వారు యాపిల్‌ను మరిగించి తీసుకోవాలని డైటీషియన్ జైన్ చెబుతున్నారు. వండిన యాపిల్స్ పెక్టిన్ అనే ప్రీబయాటిక్ను రిలీజ్ చేయడంతో ప్రేవుల్లో మంచి బ్యాక్టీరియాను ప్రేరేపించి జీర్ణక్రియ సజావుగా సాగేలా చేస్తుంది.
Read More :
Bull attack | గంగిరెద్దు షాకింగ్ ఎటాక్.. ఎగిరి లారీకింద పడిన బైకర్.. Video
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

