Bones Health | ఎముకలు బలంగా ఉండాలంటే క్యాల్షియం మాత్రమే చాలదు.. ఇవి కూడా అవసరమే..!
ఎముకలు బలంగా ఉండాలంటే కేవలం కాల్షియం సరిపోతుందని చాలామంది భావిస్తారు. కానీ వాస్తవానికి ఎముకల ఆరోగ్యం కోసం కాల్షియం మాత్రమే కాదు, ఇతర ఖనిజాలు, యాంటీ-ఇన్ఫ్లమేటరీ పోషకాలు, అలాగే శరీరంలో పోషకాల శోషణకు సహాయపడే అంశాలు కూడా అవసరం.
Bones Health | ఎముకలు బలంగా ఉండాలంటే కేవలం కాల్షియం సరిపోతుందని చాలామంది భావిస్తారు. కానీ వాస్తవానికి ఎముకల ఆరోగ్యం కోసం కాల్షియం మాత్రమే కాదు, ఇతర ఖనిజాలు, యాంటీ-ఇన్ఫ్లమేటరీ పోషకాలు, అలాగే శరీరంలో పోషకాల శోషణకు సహాయపడే అంశాలు కూడా అవసరం. పోషకాహార నిపుణుల ప్రకారం, రోజువారీ ఆహారంలో కొన్ని సాధారణ పదార్థాలను చేర్చడం ద్వారా ఎముకలను బలంగా ఉంచుకోవచ్చు. ఎముకల బలానికి, ఆరోగ్యానికి సహాయపడే ఆహారాల గురించి పోషకాహార నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ పోషకాలు కావాలి..
నువ్వులు (Sesame seeds) ఎముకల ఖనిజీకరణకు ఎంతో ఉపయోగపడతాయి. రోజుకు ఒక టేబుల్ స్పూన్ నువ్వులు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. వీటిలో క్యాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్ వంటి ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి ఎముకల నిర్మాణం, సంరక్షణకు కీలకం. అంతేకాకుండా యాంటీ ఆక్సిడెంట్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, జింక్, ఐరన్, కాపర్ వంటి ఖనిజాలు కూడా నువ్వుల్లో లభిస్తాయి. అలాగే మష్రూమ్స్ (Mushrooms) ఎముకల సాంద్రతను పెంచడంలో సహాయపడతాయి. రోజుకు ఒక బౌల్ మష్రూమ్స్ తీసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. మష్రూమ్స్‌లో విటమిన్ D సహజంగా లభిస్తుంది, ఎందుకంటే ఇవి సూర్యకాంతికి గురవుతాయి. ఈ విటమిన్ కాల్షియం శోషణకు అవసరం. అదనంగా సెలీనియం, పొటాషియం వంటి ఖనిజాలు కూడా వీటిలో ఉంటాయి.
వీటిని తీసుకుంటే మేలు..
అదే విధంగా పసుపు (Turmeric) కీళ్ల నొప్పి, గట్టితనాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. రోజుకు ఒక టీ స్పూన్ పసుపు తీసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉన్న కర్కుమిన్ అనే పదార్థం వాపును తగ్గించి, ఎముకలు దెబ్బతినడాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇక అక్రోట్లు (Walnuts) కీళ్ల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, వాపులను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. రోజుకు నాలుగు అక్రోట్లు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు ఎక్కువగా ఉండటం వల్ల దీర్ఘకాలిక వాపులను తగ్గించి, ఎముకలు, కీళ్ల ఆరోగ్యాన్ని కాపాడుతాయి. ఎముకల బలం కోసం కేవలం సప్లిమెంట్స్‌పై ఆధారపడకుండా, ప్రతిరోజూ తీసుకునే ఆహారంలో సమతుల పోషకాలు ఉండేలా చూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. రోజువారీ ఆహార అలవాట్ల ద్వారానే నిజమైన ఎముకల బలం నిర్మితమవుతుందని స్పష్టం చేస్తున్నారు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
- Tags
- Bones health
- health tips
RELATED ARTICLES
తాజా వార్తలు
నాగినేనిప్రోలు రెడ్డిపాలెం పింఛన్ దరఖాస్తుల పరిశీలన
Anupama Parameswaran | డ్యాన్స్ షో ఆఫర్ వస్తే అనుపమ పరమేశ్వరన్ షాకయ్యిందట.. ఎందుకో తెలుసా.. ?
తెగులు మందు కొట్టడంతో క్షీణించిన వరి.. రూ.10 లక్షలు నష్టం?
467 సీసీ టీవీ కెమెరాలతో పటిష్టమైన నిఘా వ్యవస్థ : ఎస్పీ రోహిత్ రాజు
Madhu Kambikar | చిత్రసీమలో మరో విషాదం.. పటేకర్ ‘రీల్ అమ్మ’ కన్నుమూత..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

