Assam : అస్సాంలో 25,703వేల మంది హెచ్ఐవీతో బాధపడుతున్నారని రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ గురువారం వెల్లడించింది. వీళ్లలో 45 శాతం మంది మహిళలు, 3 శాతం మంది చిన్నపిల్లలు ఉన్నారని తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా 10,765 వేల మంది యాంటీరిట్రోవైరల్ థెరపీ తీసుకుంటున్నారని చెప్పింది. కామ్రూప్ జిల్లాలో అత్యధికంగా 7,610హెచ్ఐవీ కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాతి స్థానాల్లో కచర్ (5,200 కేసులు), నగాం (1,602), దిబ్రుగర్(1,402) జిల్లాలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా హెచ్ఐవీ వ్యాప్తి 0.21 శాతం ఉంటే అస్సాంలో 0.09 శాతం మాత్రం ఉందని తెలిపింది.
రాష్ట్రంలో హెచ్ఐవీ వ్యాపించడానికి కారణాలను కూడా వెల్లడించింది. 81.63 శాతం కేసులు హోమోసెక్యువల్ వల్ల, 5.54 శాతం కేసులు హెచ్ఐవీ ఇన్ఫెక్షన్ ఉన్న సిరంజీలను ఉపయోగించడం వల్ల వస్తున్నాయని తెలిపింది. కేసులు తల్లిదండ్రుల నుంచి పిల్లలకు వ్యాపించే హెచ్ఐవీ కేసులు సంఖ్య 4.76 శాతం అని చెప్పింది.