Better Sleep : మెరుగైన శారీరక, మానసిక ఆరోగ్యానికి కంటి నిండా కునుకు తీయడం ఎంతో అవసరం. నిద్రలేమితో పలు అనారోగ్య సమస్యలు వెంటాడతాయి. హార్మోన్లు సహా ఎన్నో అంశాలు నిద్రను ప్రభావితం చేస్తుంటాయి. నిద్ర లేమితో బాధపడేవారు మెలటోనిన్ సప్లిమెంట్స్ తీసుకుంటారు.
ఈ సప్లిమెంట్స్ సురక్షితమే అయినా కొందరిలో తలనొప్పి, కండ్లు తిరగడం, వికారం, మగత వంటి సైడ్ ఎఫెక్ట్స్ కనిపిస్తాయి. నిద్రలేమితో బాధపడేవారు సప్లిమెంట్స్ జోలికి వెళ్లకుండా మెలటోనిన్ అధికంగా ఉండే ఆహార పదార్ధాలను తీసుకోవడం ద్వారా సమస్యను అధిగమించవచ్చు. ఇక నిద్రలేమికి చెక్ పెట్టేందుకు ప్రతిరోజూ ఆహారంలో ఎగ్స్‌ను భాగం చేసుకోవాలి.
ఎగ్స్‌లో ప్రొటీన్ సహా ఇరత సూక్ష్మపోషకాలు ఉంటాయి. ఇందులో మెలటోనిన్ అధికంగా ఉండటంతో నిద్రలేమిని నివారిస్తుంది. ఇక గుడ్లతో పాటు రోజూ పాలు తీసుకోవాలి. పాలలో క్యాల్షియంతో పాటు మెలటోనిన్ కూడా ఉండటంతో ఇన్‌సోమ్నియాను ఇది నివారిస్తుంది. ఇంకా కంటినిండా కునుకు తీసేందుకు ఈ ఆహార పదార్ధాలను నిత్యం తీసుకోవాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.
ఎగ్స్
పాలు
చేపలు
నట్స్
చెర్రీస్
Read More :
BJP | రైల్వే స్టేషన్లో పట్టుబడ్డ రూ.4 కోట్లు.. బీజేపీ కార్యకర్త అరెస్టు