Mediterranean Diet : గ్రీస్, ఇటలీ, క్రొయేషియా, టర్కీ, స్పెయిన్, మొరాకో సహా మధ్యతరహా ప్రాంత వాసులు అనుసరించే ఆహార పద్ధతులు ఎంతో ఆరోగ్యకరంగా, పోషకాల గనిగా రుచికరంగా ఉంటాయనే పేరుంది. అందుకే వరుసగా ఏడోసారి మద్యధరా తరహా ఆహారం 2024లో అత్యంత ఆరోగ్యకరమైన ఆహారంగా నిపుణుల ప్యానెల్ ఏడో సారి ఎంపిక చేసిందని యూఎస్ న్యూస్ అండ్ వరల్డ్ రిపోర్ట్ వెల్లడించింది.
మద్యధరా ప్రాంతంలో భిన్న ఆహారాలను ప్రజలు తీసుకుంటుండగా ప్రధానంగా హోల్ గ్రెయిన్స్, బీన్స్, నట్స్, ఎక్ట్రా వర్జిన్ ఆయిల్ నుంచి చేసే అసంతృప్త కొవ్వులు, సీఫడ్ వంటి ఆహారాన్ని అధికంగా తీసుకుంటారు. మొక్కల ఆధారిత ఆహారాన్ని ఎక్కువగా వినియోగిస్తారు. మద్యధరా తరహా ఆహారంతో హృద్రోగ ముప్పు, టైప్ 2 మధుమేహ ముప్పు తగ్గి జీవన ప్రమాణాలను మెరుగుపరిచి దీర్ఘాయువు సాధ్యమవుతుందని పలు అధ్యయనాలు వెల్లడించాయి.
మద్యధరా తరహా ఆహారంలో ప్లేట్లో పలు రకాల ఆహార పదార్ధాలను వడ్డించి ఆరగిస్తారు. వారానికి రెండుసార్లు సీఫుడ్ తీసుకుంటారు. పౌల్ట్రీ, ఎగ్స్, వెన్న, యోగర్ట్ మితంగా తీసుకుంటారు. రెడ్ మీట్, స్వీట్లు అరుదుగా తింటారు. అప్పుడప్పుడూ రెడ్ వైన్ తీసుకుంటారు. సోడియం, షుగర్, ప్రాసెస్డ్ ఆహార పదార్ధాలను బాగా తగ్గించి పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, ఆరోగ్యకర కొవ్వులను అధికంగా తీసుకుంటారు.
Read More :