Cancer | నోటి క్యాన్సర్‌ను గుర్తించే లాలీపాప్స్!
Cancer | ప్రారంభ దశలోనే నోటి కాన్సర్‌ను గుర్తించటానికి యూకే శాస్త్రవేత్తలు సువాసన గల లాలీపాప్స్‌ను అభివృద్ధి చేస్తున్నారు. ఇప్పటిదాకా నోటి కాన్సర్‌ను గుర్తించటానికి చేసే పరీక్షలు కాస్త నొప్పితో కూడుకున్నవిగా ఉండేవి.
Cancer | లండన్, మార్చి 23: ప్రారంభ దశలోనే నోటి కాన్సర్‌ను గుర్తించటానికి యూకే శాస్త్రవేత్తలు సువాసన గల లాలీపాప్స్‌ను అభివృద్ధి చేస్తున్నారు. ఇప్పటిదాకా నోటి కాన్సర్‌ను గుర్తించటానికి చేసే పరీక్షలు కాస్త నొప్పితో కూడుకున్నవిగా ఉండేవి. ఎంతో నైపుణ్యం అవసరమయ్యేది. కానీ ఇప్పుడు శాస్త్రవేత్తలు కనిపెడుతున్న ఈ లాలీపాప్స్ వల్ల రోగ నిర్ధారణ వేగవంతమైనదే కాక ఎంతో సున్నితమైనది. బర్మింగ్‌హామ్ యూనివర్సిటీ అభివృద్ధి చేసిన ఈ లాలీపాప్స్ స్మార్ట్ హైడ్రోజెల్‌తో తయారు చేస్తారు.
లాలాజల నమూనాలను హైడ్రోజెల్‌లోకి బదిలీ చేయటానికి రోగులు వాటిని పీల్చాలి. హైడ్రోజెల్ ఒక విధమైన మాలిక్యులర్ నెట్‌గా పనిచేస్తుంది. లాలాజలం, ప్రొటీన్లను అది గ్రహిస్తుంది. హైడ్రోజెల్‌కు అతుక్కున్న ప్రొటీన్లను విశ్లేషించటం ద్వారా రోగ నిర్ధారణ చేయవచ్చు. నోటి కాన్సర్‌ను నిర్ధారించటానికి స్మార్ట్ హైడ్రోజెల్స్ నిజంగా ఎంతో ఉత్తేజకరమైన సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని, లాలాజలంలోని ప్రొటీన్‌ను ఇవి సులభంగా గ్రహిస్తాయని బర్మింగ్‌హామ్ యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ రుచి గుప్తా తెలిపారు. ఈ ప్రాజెక్టు తదుపరి దశను త్వరలో ప్రారంభిస్తున్నామని ఆమె వెల్లడించారు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

