Listening To Music | ప్రస్తుతం చాలా మంది అధికంగా ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. పని విషయంలో కలిగే ఒత్తిడితోపాటు ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యల కారణంగా కూడా చాలా మంది ఆందోళన చెందుతూ మానసిక సమస్యల బారిన పడుతున్నారు. ఒత్తిడి అనేది ఎంత అధికంగా ఉంటుంది అంటే.. దీని కారణంగా చాలా మంది చిన్న వయస్సులోనే గుండె పోటుతో మరణిస్తున్నారు. ఇలాంటి సంఘటనలను ప్రస్తుతం మనం అనేకం చూస్తున్నాం. అందుకనే వైద్యులు సైతం ఒత్తిడిని తగ్గించుకోవాలని సూచనలు చేస్తుంటారు. అయితే ఒత్తిడిని తగ్గించుకునేందుకు చాలా మంది రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ ఈ సమస్య నుంచి బయట పడేందుకు సంగీతం వినడం చక్కగా ఉపయోగపడుతుందని పరిశోధకులు అంటున్నారు.
రోజూ తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నవారు కాసేపు తమకు ఇష్టమైన సంగీతం వినాలని పరిశోధకులు సూచిస్తున్నారు. సంగీతం వినడం వల్ల శరీరం యాక్టివ్‌గా మారుతుంది. మూడ్ మారి హ్యాపీగా ఉంటారని చెబుతన్నారు. సంగీతం వినడం వల్ల ఒత్తిడి స్థాయిలు తగ్గుతాయి. మెదడు యాక్టివ్‌గా పనిచేస్తుంది. ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతాయి. అధ్యయనాలు చెబుతున్న ప్రకారం సంగీతం వినడం అనేది మెదడును ఎల్లప్పుడూ యాక్టివ్‌గా, అలర్ట్‌గా ఉంచుతుంది. మెదడు పదునుగా మారుతుంది. జ్ఞాపకశక్తి పెరుగుతుంది. సంగీతం వినడం వల్ల శరీరంలో రక్త సరఫరా మెరుగు పడుతుంది. బీపీ తగ్గుతుంది. గుండె కొట్టుకునే వేగం క్రమబద్దంగా ఉంటుంది. దీంతో ఆందోళన నుంచి ఉపశమనం లభిస్తుంది. గుండె జబ్బులు రాకుండా చూసుకోవచ్చు.
మానసిక ఆరోగ్య నిపుణులు చెబుతున్న ప్రకారం.. రోజూ కాసేపు ప్రశాంతమైన సంగీతాన్ని తక్కువ సౌండ్‌తో వినడం వల్ల గుండె కొట్టుకునే వేగం తగ్గి ఒత్తిడి నుంచి బయట పడతారు. మైండ్ రిలాక్స్ అవుతుంది. మన శరీరంలో డోపమైన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఇది హ్యాపీ హార్మోన్. ఈ హార్మోన్ రిలీజ్ అయితే మన మూడ్ మారుతుంది. ఒత్తిడి తగ్గి హ్యాపీ మూడ్‌లోకి వచ్చేస్తాం. మనసులో ఉండే తీవ్రమైన బాధ తగ్గేందుకు కూడా సంగీతం ఎంతగానో సహాయ పడుతుందని అంటున్నారు. రోజూ సంగీతం వింటే మానసికంగానే కాక శారీరకంగా కూడా ఆరోగ్యం మెరుగు పడుతుందని అంటున్నారు.
రోజూ కాసేపు ఇష్టమైన సంగీతం వింటే ఒత్తిడి క్రమంగా తగ్గడంతోపాటు డిప్రెషన్లోకి వెళ్లే అవకాశాలు కూడా తగ్గుతాయి. సాధారణంగా చాలా మందికి ఒత్తిడి అధికంగా ఉంటుంది. దీన్ని నిర్వహించలేకపోతే దీర్ఘకాలంలో అది డిప్రెషన్‌కు దారి తీస్తుంది. దీంతో ఆత్మహత్య చేసుకోవాలనుకునే ఆలోచనలు పెరుగుతాయి. ఈ పరిస్థితి రాకుండా ఉండాలంటే రోజూ కాసేపు సంగీతం వినాలని సూచిస్తున్నారు. మ్యూజిక్ థెరపీ అనేది ఎంతో ప్రభావవంతంగా పనిచేస్తుందని అంటున్నారు. ఆందోళన అధికంగా ఉన్నవారు కూడా సంగీతం వింటే ఆ సమస్య నుంచి బయట పడవచ్చు. అలాగే సంగీతం వినడం వల్ల ఒత్తిడి స్థాయిలు తగ్గి ఆయుర్దాయం కూడా పెరుగుతుందని సైంటిస్టుల అధ్యయనాలు చెబుతున్నాయి. కనుక ఒత్తిడిని ఎదుర్కొంటున్నవారు రోజూ కాసేపు తమకు ఇష్టమైన సంగీతాన్ని వింటే ఆ సమస్య నుంచి సులభంగా బయట పడవచ్చు. మానసిక ప్రశాంతత లభిస్తుంది.