Kidney health | కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే మీరు తీసుకునే ఆహారంలో ఇవి కచ్చితంగా ఉండాల్సిందే..!
Kidney health | Kidney health : మన శరీరంలోని అతి ముఖ్యమైన అవయవాల్లో కిడ్నీలు కూడా ఒక భాగం. శరీరంలోని మలినాలను తొలగించి శుభ్రంగా ఉంచడంలో కిడ్నీలు కీలకపాత్ర పోషిస్తాయి. మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఎప్పటికప్పుడు ఒంట్లోని మలినాలు తొలగిపోవాలి. మలినాలు తొలగిపోవాలంటే కిడ్నీల పనితీరు బాగుండాలి.
Kidney health : మన శరీరంలోని అతి ముఖ్యమైన అవయవాల్లో కిడ్నీలు (Kidneys) కూడా ఒక భాగం. శరీరంలోని మలినాలను తొలగించి శుభ్రంగా ఉంచడంలో కిడ్నీలు కీలకపాత్ర పోషిస్తాయి. మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఎప్పటికప్పుడు ఒంట్లోని మలినాలు తొలగిపోవాలి. మలినాలు తొలగిపోవాలంటే కిడ్నీల పనితీరు బాగుండాలి. లేదంటే శరీరం మొత్తం అస్తవ్యస్తం అవుతుంది. మరి కిడ్నీలు సమర్థంగా పనిచేయాలంటే కొన్ని రకాల ఆహార పదార్థాలను మీ డైట్లో కచ్చితంగా చేర్చుకోవాల్సిందే. మరి ఆ ఆహార పదార్థాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
1. వెల్లుల్లి
వెల్లుల్లిని మూత్రపిండాల రక్షణకు మంచి ఆహారంగా చెప్పవచ్చు. వెల్లుల్లిలో యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ క్లాటింగ్ కణాలు ఉండటంవల్ల చెడు కొలెస్ట్రాల్ లెవల్స్‌ను తగ్గిస్తుంది.
2. మొలకెత్తిన విత్తనాలు
శనగలు, పెసర్లు లాంటి ధాన్యాలను తరచూ మొలకెత్తించి తినడంవల్ల మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉంటాయి. వీటిలోని ఫైబర్ శరీరంలోని మలినాలను తనతో కలుపుకుని విసర్జితమవుతుంది. అందువల్ల మూత్రపిండాలు శుభ్రపడి కిడ్నీల్లో రాళ్ల సమస్య రాకుండా ఉంటుంది.
3. క్యాబేజీ
క్యాబేజీ మూత్రపిండాల పనితీరును మెరుగుపర్చడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. సాధారణంగా క్యాబేజీని కిడ్నీల డ్యామేజ్‌ను అరికట్టే సహజ ఔషధంగా వినియోగిస్తారు.
4. ఉల్లిపాయ
ఉల్లిపాయలు కిడ్నీల్లో రాళ్లను తొలగించడానికి తోడ్పడుతాయి. అంతేగాక మూత్రపిండాలను నిర్విషీకరణ చేయడంలో కూడా ముఖ్యపాత్ర పోషిస్తాయి.
5. బెర్రీస్
బెర్రీస్ వివిధ రంగుల్లో లభ్యమవుతాయి. వాటిలో బ్లాక్‌బెర్రీ మినహా మిగతా అన్ని రకాల బెర్రీలు కిడ్నీలకు మేలు చేసేవే. స్ట్రాబెర్రీ, క్రాన్ బెర్రీస్, బ్లూబెర్రీస్ అన్నింటిలోనూ న్యూట్రియంట్స్, యాంటీ ఇన్ఫ్లమేటరి క్వాలిటీస్ సమృద్ధిగా ఉంటాయి. అందుకే అవి వ్యాధి నిరోధకతను పెంచి బ్లాడర్ ఫంక్షన్స్ సక్రమంగా ఉండేందుకు దోహదపడుతాయి.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kidney health | కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే మీరు తీసుకునే ఆహారంలో ఇవి కచ్చితంగా ఉండాల్సిందే..!
నిరుద్యోగ యువతను మోసం చేసిన కాంగ్రెస్‌కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
Harish Rao | మల్లన్నసాగర్‌కు అతీ సమీపంలో బ్లాస్టింగ్లు.. ప్రమాదంలో రిజర్వాయర్ : మాజీ మంత్రి హరీష్‌రావు ఆందోళన
Bigg Boss | బిగ్ బాస్ హౌస్‌లో ఇన్ని ఇబ్బందులా .. షో వెనుక అసలు విషయాలు బయటపెట్టిన దక్షి!
టేకులపల్లిలో కటారుసుం వేలం
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

