బూస్టర్ జోష్ : ఆ టీకాతో తొమ్మిది రెట్లు పెరిగిన యాంటీబాడీలు!

లండన్ : తమ కొవిడ్-19 వ్యాక్సిన్ రెండో డోసుతో మెరుగైన వ్యాధి నిరోధక స్పందన లభిస్తోందని జాన్సన్ అండ్ జాన్సన్ వెల్లడించింది. జాన్సన్ వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్న ఆరు నుంచి ఎనిమిది నెలల తర్వాత రెండవ డోసు తీసుకున్న వారిలో మొదటి డోసు తీసుకున్న వారితో పోలిస్తే తొమ్మిది రెట్లు అధికంగా యాంటీ బాడీ లెవెల్స్ పెరిగినట్టు వెల్లడైందని కంపెనీ పేర్కొంది. ఫైజర్, బయోఎన్‌టెక్, మోడెర్నా వ్యాక్సిన్ల రెండు డోసులు తీసుకున్న వారికి బూస్టర్ డోసు ఇవ్వాలని అమెరికా యోచిస్తున్న నేపథ్యంలో జే అండ్ జే ఈ ఫలితాలు వెల్లడించింది.
కాగా ఈ అద్యయనంలో ఎంత మంది పాల్గొన్నారు..ఎక్కడ నిర్వహించారనే వివరాలను పరిశోధకులు వెల్లడించలేదు. పరిశోధన వివరాలు, స్టడీ డేటాను ఆహార ఔషధ మండలి (ఎఫ్‌డీఏ)కి సమర్పిస్తామని జే అండ్ జే తెలిపింది. ఇక అమెరికాలో ప్రస్తుతం రోగనిరోధక వ్యవస్ధ స్పందన తక్కువగా ఉన్న అమెరికన్లకు బూస్టర్ డోస్‌లు ఇస్తుండగా ఎఫ్‌డీఏ ఆమోదం లభిస్తే ఫైజర్, మోడెర్నా వ్యాక్సిన్లు తీసుకున్న 18 ఏండ్ల పైబడిన వారందరికీ బూస్టర్ డోస్‌లు ఇస్తామని బైడెన్ ప్రభుత్వం గత వారం వెల్లడించింది.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

