Jaggery Benefits | వామ్మో.. బెల్లం తింటే ఇన్ని లాభాలున్నాయా ?
Jaggery Benefits | ఇప్పుడంటే పంచదార అందరికీ అలవాటైపోయింది కానీ.. ఒకప్పుడు తీపి అంటే బెల్లమే. పంచదారకు ఆరోగ్యకర ప్రత్యామ్నాయం ఇదేనంటారు నిపుణులు. పంచదార పక్కా రిఫైన్డ్ ఆహారం. పోషకాలన్నీ తొలగిపోయి, రుచి మాత్రమే మిగిలేలా శుద్ధి చేసిన పదార్థం. బెల్లం అలా కాదు...
Jaggery Benefits | ఇప్పుడంటే పంచదార అందరికీ అలవాటైపోయింది కానీ.. ఒకప్పుడు తీపి అంటే బెల్లమే. పంచదారకు ఆరోగ్యకర ప్రత్యామ్నాయం ఇదేనంటారు నిపుణులు. పంచదార పక్కా రిఫైన్డ్ ఆహారం. పోషకాలన్నీ తొలగిపోయి, రుచి మాత్రమే మిగిలేలా శుద్ధి చేసిన పదార్థం. బెల్లం అలా కాదు…
- బెల్లంలో కొంత పీచు ఉంటుంది. జీర్ణాశయానికి సాయపడుతూ, మలబద్ధకాన్ని పోగొడుతుంది. ఇందులోని జింక్, సెలీనియం ఒంట్లోని వ్యర్థాలను వదిలించే డీటాక్స్లా పనిచేస్తాయి. కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.
- కఫ సంబంధ వ్యాధులకు చెక్ పెట్టి, ఊపిరి తిత్తులకు బెల్లం మేలు చేస్తుందనీ చెబుతారు. శీతకాలంలో గోరువెచ్చని నీటిలో చెంచాడు బెల్లం తీసుకుంటే జలుబు, దగ్గు, గొంతునొప్పి లాంటి సమస్యలు రావని అంటారు.
- దీనికి ఒంటిని చల్లబరిచే గుణం కూడా ఉందంటారు. అందుకే బెల్లం పానకం తాగమని సూచిస్తారు. రామనవమికి దాన్ని ఓ సంప్రదాయంగా కూడా మార్చారు.
- బెల్లంతో పాటు కాస్త అల్లం, నువ్వులు, నెయ్యి కలిపిన మిఠాయి అమృతంతో సమానమట. దీంతో కీళ్ల నొప్పులు తగ్గుతాయని చెబుతారు. ఐరన్ లాంటి పోషకాలూ అందుతాయి.
- రక్తపోటును తగ్గించే గుణం, రక్తాన్ని శుద్ధి చేసే లక్షణం, కడుపుబ్బరాన్ని నియంత్రించే స్వభావమూ బెల్లానికి ఉంది. భోజనం తర్వాత మిఠాయి తీసుకునే అలవాటు ఉన్నవారు, చిన్న బెల్లం ముక్క నోట్లో వేసుకుంటే మేలు. అలాగని అధిక మోతాదులో తీసుకుంటే షుగర్ లెవల్స్ పెరిగిపోతాయి జాగ్రత్త!
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

