Apps:
Follow us on:

Parenting Tips | మీ పిల్లలు రాత్రిపూట పక్క తడుపుతున్నారా? ఈ టిప్స్‌తో అలవాటు మాన్పించవచ్చు

1/7పిల్లలు పక్క తడిపే అలవాటుని మెడికల్ టర్మినాలజీలో నాక్టర్నల్ ఎన్యురెసిస్ అంటారు. ఈ సమస్య పిల్లలకు ఓ వయసు వచ్చే వరకూ ఉంటుంది. అయితే కొందరు పిల్లలు 6, 7 సంవత్సరాలు వచ్చాక కూడా ఈ అలవాటు మానుకోరు. ఇదే కొనసాగితే ఆందోళన తప్పదంటున్నారు నిపుణులు.
2/7పడుకునే గది ఉష్ణోగ్రత తక్కువగా ఉండటం. పాలు, నీళ్లు లాంటి ద్రవపదార్థాలను ఎక్కువగా తీసుకోవడం, పడుకునే ముందు ఏదైనా తాగడం వంటి వాటివల్ల ఈ సమస్య తలెత్తవచ్చు.
3/7బిడ్డ మూత్రాశయం తక్కువగా అభివృద్ధి చెందడం లేదా ఇంకా అభివృద్ధి చెందుతున్న దశలోనే ఉందా అనేది నిర్ధారించుకోవాలి. ఈ సమస్యలు ఉంటే పిల్లలు మూత్రాన్ని నియంత్రించలేరు.
4/7 బిడ్డ ఆహారంలో అధికంగా కెఫిన్, డైయూరిటక్స్ వంటివి ఎక్కువగా ఉన్నా మూత్రం ఉత్పత్తి పెరుగుతుంది. ఒక్కోసారి బద్దకం కూడా కారణం కావొచ్చు.
5/7పిల్లలు రాత్రిపూట ఎక్కువసార్లు పక్క తడిపితే మధుమేహం, యూరినరీ ట్రాక్ ఇన్‌ఫెక్షన్, మానసిక ఒత్తిడి, జన్యుపరమైన సమస్యలుగా గుర్తించాలి. ఇలాంటి వారిని పిల్లల వైద్యుడికి చూపించాలి. పిల్లలకు వాల్‌నట్స్, కిస్మిస్ తినడం అలవాటు చేస్తే సమస్య కొంతవరకు తగ్గుతుంది.
6/7పిల్లలకు పూటకో అరటిపండు తినిపించాలి. ఇది జీర్ణవ్యవస్థకు తోడ్పడుతూ, మూత్రాశయంలో అదనపు ద్రవాన్ని నిరోధించడానికి సహాయపడుతుంది. రాత్రిపూట తింటే దగ్గు వచ్చే అవకాశం ఉంటుంది. పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం అరటిపండు తినిపించడం మంచిది.
7/7దాల్చిన చెక్కను పొడిచేసి దాన్ని కొద్దిగా తీసుకొని అందులో కొద్దిగా తేనె కలిపి ఇస్తే పక్క తడిపే అలవాటుని నివారించవచ్చు. రాత్రి వేళల్లో పిల్లలు స్వీట్లు, చాక్లెట్లు వంటివి తినకుండా చూడాలి.