Health Tips : శరీర ఆరోగ్యానికి తగినంతగా ఫైబర్‌తో కూడిన ఆహారం తీసుకోవడం కీలకం. జీర్ణక్రియ సాఫీగా సాగడం నుంచి కొలెస్ట్రాల్, బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రించడం వరకూ ఫైబర్ ఎన్నో శరీర ధర్మాలను చక్కబెడుతుంది. మలబద్ధకం నివారించి ప్రేవుల కదలికలను ప్రేరేపించి జీర్ణక్రియ సజావుగా సాగేలా చూస్తుంది.
ఫైబర్ అధికంగా ఉన్న ఆహార పదార్ధాలను తీసుకోవడంతో పాటు ఆరోగ్యకర జీవనశైలిని అనుసరిస్తే ఫైబర్ లోపాలను అధిగమించడంతో పాటు శరీర ఆరోగ్యం మెరుగుపరుచుకోవచ్చు. ఆరోగ్యానికి కీలకమైన ఫైబర్‌లో రెండు రకాలుంటాయి. నీటిలో కరిగే సాల్యుబుల్ ఫైబర్ రక్తంలో కొలెస్ట్రాల్ లెవల్స్‌ను, బ్లడ్‌షుగర్ లెవెల్స్‌ను తగ్గిస్తుంది.
నీటిలో కరగని ఇన్సాల్యుబుల్ ఫైబర్ మలబద్ధకాన్ని నివారించి ప్రేవుల కదలికలను ప్రేరేపిస్తుంది. అయితే మనం ఫైబర్ తగినంతగా తీసుకోవడం లేదని పలు సంకేతాల ద్వారా పసిగట్టవచ్చు. మనం తీసుకునే ఆహార పదార్ధాల్లొ ఫైబర్ తగినంతగా తీసుకోవడం లేదని తెలిపే సంకేతాలను పరిశీలిస్తే..
మలబద్ధకం
గ్యాస్, కడుపుబ్బరం
తిన్న వెంటనే ఆకలివేయడం
నీరసం, నిస్సత్తువ
చర్మం నిర్జీవంగా ఉండటం
తీవ్ర అనారోగ్యాల ముప్పు
అధిక కొలెస్ట్రాల్ లెవెల్స్
మలం గట్టిపడటం
విపరీతంగా బరువు పెరగడం లేదా తగ్గడం
Read More :