పుట్టిన రెండో రోజే ఫిట్స్?
ఓ పాఠకురాలు ఫిట్స్ అనేవి శిశువులలో రకరకాల కారణాలతో వస్తాయి. తగినంత షుగర్ శాతం లేకపోయినా, క్యాల్షియం లాంటి ఖనిజాలు తక్కువగా ఉన్నా రావచ్చు.
- పిల్లల పెంపకం
మా పాపకు మూడు వారాలు. పుట్టిన రెండో రోజే ఫిట్స్ వచ్చాయి. ఆ ఒక్క సమస్య మినహాయిస్తే ఆరోగ్యంగానే ఉంది. పుట్టగానే ఏడ్చింది కూడా. పుట్టుకతో వచ్చిన ఫిట్స్ జీవితాంతం ఉంటాయని అంటారు. నిజమేనా?
ఓ పాఠకురాలు ఫిట్స్ అనేవి శిశువులలో రకరకాల కారణాలతో వస్తాయి. తగినంత షుగర్ శాతం లేకపోయినా, క్యాల్షియం లాంటి ఖనిజాలు తక్కువగా ఉన్నా రావచ్చు. మెదడు వ్యవస్థలో లోపాల వల్ల కూడా రావచ్చు. బిడ్డ పుట్టిన రెండో రోజు వచ్చి.. మళ్లీ రాలేదంటే తాత్కాలికమైన ఫిట్స్‌గా భావించాల్సి ఉంటుంది. కొన్నిసార్లు ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా ఇలా జరుగుతుంది. బిడ్డ ప్రవర్తన గురించి మీరు చెప్పలేదు. కాళ్లూ చేతుల కదలిక ఎలా ఉంది? నిత్యం నిద్రమత్తులో ఉంటుందా? ఎదుగుదల ఎలా ఉంది? అనేది కూడా గమనించుకుంటూ ఉండాలి. ఎందుకైనా మంచిది బిడ్డకు బ్రెయిన్ స్కాన్, ఈఈజీ తదితర
పరీక్షలు చేయించి నిపుణుల అభిప్రాయం తీసుకోండి.
– డాక్టర్ విజయానంద్ నియోనేటాలజిస్ట్ అండ్ పీడియాట్రీషియన్ రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్స్
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పోలీసు సిబ్బందికి సేవా పతకాలు
Botsa Satyanarayana | బీసీలను మరోసారి మోసం చేసిన చంద్రబాబు : బొత్స సత్యనారాయణ
Asian Hockey Championships | పాకిస్థాన్‌కు మరో ఎదురుదెబ్బ.. ఈసారి టోర్నీకి ముందే దాయాది ఔట్..!
సైబర్ నేరాల పట్ల అప్రమత్తతే ప్రధానం : పోలీస్ కమిషనర్ సునీల్ దత్
Oxygen Cylinder Explodes | అంబులెన్స్‌లో పేలిన ఆక్సిజన్ సిలిండర్.. రోగి మృతి, ఇద్దరికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

