Gond Katira | వేసవి కాలంలో శరీరాన్ని చల్లబరిచే అద్భుతమైన పదార్థం ఇది.. కానీ జాగ్రత్తగా తీసుకోవాల్సిందే..
వేసవి కాలం కావడంతో శరీరానికి చల్లదనం ఇచ్చే ఆహారాలు, పానీయాల వినియోగం పెరుగుతోంది. శరీరానికి చల్లదనాన్ని ఇచ్చే సంప్రదాయ పదార్థాల్లో గోండ్ కతీరా కూడా ఒకటి. సహజసిద్ధమైన ఈ గమ్‌ను చాలామంది శర్బత్లు, మిఠాయిలు, కూలింగ్ డ్రింక్స్‌లో ఉపయోగిస్తుంటారు. శరీరాన్ని చల్లగా ఉంచడంలో, హైడ్రేషన్ మెరుగుపరచడంలో ఇది సహాయపడుతుంది.
Gond Katira | వేసవి కాలం కావడంతో శరీరానికి చల్లదనం ఇచ్చే ఆహారాలు, పానీయాల వినియోగం పెరుగుతోంది. శరీరానికి చల్లదనాన్ని ఇచ్చే సంప్రదాయ పదార్థాల్లో గోండ్ కతీరా కూడా ఒకటి. సహజసిద్ధమైన ఈ గమ్‌ను చాలామంది శర్బత్లు, మిఠాయిలు, కూలింగ్ డ్రింక్స్‌లో ఉపయోగిస్తుంటారు. శరీరాన్ని చల్లగా ఉంచడంలో, హైడ్రేషన్ మెరుగుపరచడంలో ఇది సహాయపడుతుంది. అయితే గోండ్ కతీరాను సరైన సమయంలో, సరైన మోతాదులో తీసుకోవడం చాలా ముఖ్యమని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. పోషకాహార నిపుణుల ప్రకారం, గోండ్ కతీరాను ఉదయం ఖాళీ కడుపుతో లేదా మధ్యాహ్నానికి ముందు సమయంలో తీసుకోవడం ఉత్తమం. ముఖ్యంగా వేసవిలో దీనిని రోజులో తొందరగా తీసుకోవడం వల్ల శరీరానికి చల్లదనం ఎక్కువగా అందుతుందని చెబుతున్నారు. రాత్రి సమయంలో లేదా అధిక మోతాదులో తీసుకుంటే జీర్ణక్రియ మందగించే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా సున్నితమైన జీర్ణవ్యవస్థ ఉన్నవారికి ఇది భారంగా అనిపిస్తుందని పేర్కొంటున్నారు.
సరైన విధంగా నానబెట్టాలి..
గోండ్ కతీరా నీటిలో నానిన తర్వాత జెల్లా మారుతుంది. ఇదే దాని చల్లదనానికి ప్రధాన కారణం. అయితే ఈ జెల్ ఆకృతి కొందరిలో జీర్ణక్రియను నెమ్మదింపజేస్తుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే దీన్ని సరైన విధంగా తీసుకోవడం అవసరమని సూచిస్తున్నారు. గోండ్ కతీరాను తీసుకునే ముందు ఒకటి నుంచి రెండు టీ స్పూన్ల మోతాదులో రాత్రంతా నీటిలో నానబెట్టాలని సూచిస్తున్నారు. తరువాత తయారైన జెల్లో ఒకటి నుంచి రెండు టేబుల్ స్పూన్ల వరకు తీసుకోవచ్చు. దీన్ని తగినంత ద్రవాలతో కలిపి తీసుకోవడం మంచిదని చెబుతున్నారు. అయితే పొడిగా నేరుగా తినకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే గోండ్ కతీరా అందరికీ ఒకేలా అనుకూలించదని కూడా నిపుణులు చెబుతున్నారు. కడుపు ఉబ్బరం, ఐబీఎస్, తరచుగా గ్యాస్ సమస్యలు ఉన్నవారు జాగ్రత్తగా తీసుకోవాలని సూచిస్తున్నారు. అలాగే తక్కువ బీపీ ఉన్నవారు, ఇప్పటికే అధిక ఫైబర్ ఆహారం తీసుకునేవారు, జీర్ణక్రియ నెమ్మదిగా ఉండేవారు కూడా మోతాదుపై శ్రద్ధ పెట్టాలని చెబుతున్నారు. రోజంతా తక్కువ నీరు తాగే అలవాటు ఉన్నవారికి కూడా ఇది అసౌకర్యం కలిగించే అవకాశం ఉంటుందని పేర్కొంటున్నారు.
భారీ భోజనం తరువాత వద్దు..
అనారోగ్యం నుంచి కోలుకుంటున్నవారు లేదా ఆకలి తక్కువగా ఉన్నవారు కూడా దీన్ని జాగ్రత్తగా తీసుకోవాలని సూచిస్తున్నారు. కొంతమంది మహిళలకు పీరియడ్స్ సమయంలో గోండ్ కతీరా తీసుకుంటే అధిక చల్లదనం కారణంగా అసౌకర్యంగా అనిపించే అవకాశం ఉంటుందని నిపుణులు వివరిస్తున్నారు. వ్యాయామానికి ముందు, భారీ భోజనం చేసిన వెంటనే లేదా మందులతో పాటు గోండ్ కతీరా తీసుకోవద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా మందులు తీసుకునే సమయానికి గోండ్ కతీరా మధ్య కనీసం రెండు నుంచి మూడు గంటల గ్యాప్ ఉండాలని సూచిస్తున్నారు. సరైన మోతాదులో, సరైన సమయంలో తీసుకుంటే గోండ్ కతీరా వేసవిలో శరీరానికి చల్లదనం అందించే మంచి సహజ పదార్థంగా ఉపయోగపడుతుంది. అయితే వ్యక్తిగత జీర్ణక్రియ, నీటి వినియోగం, ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తీసుకోవడం అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
- Tags
- Gond Katira
- health tips
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

