చెవి రంధ్రం పెద్దదైతే?
డాక్టర్ గారూ నమస్తే. నాకు నగలంటే పిచ్చి. అందులోనూ పెద్దపెద్ద హారాలు, నెక్లెస్‌లు వేసుకుంటాను. ఇంతవరకూ సమస్య లేదు కానీ, బరువైన లోలాకులు ధరించడం వల్ల నా చెవులు జారిపోయాయి. దీంతో అసహ్యంగా అనిపిస్తున్నది. ఫంక్షన్లకు వెళ్లలేకపోతున్నాను. దీనికి పరిష్కారం ఉందా?
డాక్టర్ గారూ నమస్తే. నాకు నగలంటే పిచ్చి. అందులోనూ పెద్దపెద్ద హారాలు, నెక్లెస్‌లు వేసుకుంటాను. ఇంతవరకూ సమస్య లేదు కానీ, బరువైన లోలాకులు ధరించడం వల్ల నా చెవులు జారిపోయాయి. దీంతో అసహ్యంగా అనిపిస్తున్నది. ఫంక్షన్లకు వెళ్లలేకపోతున్నాను. దీనికి పరిష్కారం ఉందా?
-ఓ పాఠకురాలు
నిజమే.. ఈ సమస్య చాలామంది అమ్మాయిలు ఎదుర్కొంటున్నదే. ఆభరణం మహిళ హక్కు. ఆ మక్కువను ఆమె దూరం చేసుకోలేదు. అదే సమయంలో తన ఆకృతికి మచ్చ తెచ్చుకోనూ లేదు. కానీ చాలా సందర్భాల్లో మనకు తెలియకుండానే నష్టం జరిగిపోతూ ఉంటుంది. ముఖ్యంగా బరువైన కమ్మలు, లోలాకులు ధరించినప్పుడు.. చెవి రంధ్రాలు పెద్దవైపోతుంటాయి. దీంతో చిన్నపాటి ఆభరణాలు పెట్టుకున్నప్పుడు.. ఎక్కడైనా పడిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. ఈ సమస్యకు వైద్యశాస్త్రంలో చక్కని పరిష్కారం ఉంది. సర్జరీ ద్వారా అదనపు రంధ్రాన్ని పూడ్చేయవచ్చు. మహా అయితే అరగంటలోపు ప్రొసీజర్ పూర్తయిపోతుంది. ఆ రోజే డిశ్చార్జ్ అయిపోవచ్చు. అయితే, సమస్య అంతవరకూ రాకుండా చూసుకోవడం ఉత్తమం. మధ్యేమార్గంగా తేలికపాటి నగలు ధరించండి. మార్కెట్లో లైట్‌వెయిట్ జువెలరీ బాగానే అందుబాటులో ఉంది.
-డాక్టర్ అనున్యా రెడ్డి
ఇ.ఎన్.టి సర్జన్,
ఎలర్జీ స్పెషలిస్ట్, ఫేషియల్ కాస్మటిక్ సర్జన్
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మద్యం సేవించి వాహనాలు నడపొద్దు : ట్రాఫిక్ ఏసిపి శ్రీనివాస్
Comrade Kalyan | 21 రోజుల్లోనే ఓటీటీలోకి ‘కామ్రేడ్ కళ్యాణ్’.. ఎలాంటి ప్రకటన లేకుండా స్ట్రీమింగ్ ప్రారంభం!
Prasidh Krishna: కివీస్‌తో వన్డేలకు ప్రసిద్ధ కృష్ణ దూరం.. ఇండియా-ఏ జట్టులోకి సిరాజ్
Mirzapur: The Movie | ఓటీటీలోకి వచ్చేసిన ‘మీర్జాపూర్: ది మూవీ’.. అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ షురూ!
Delhi Traders: 12వేల కోట్ల వ్యాపారంపై ప్రభావం.. ర్యాలీని వాయిదా వేయండి.. సోనియా గాంధీని కోరిన ఢిల్లీ వ్యాపారులు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

