Home Made Hair Oil | మహిళలు తమ జుట్టును అందంగా, ఆరోగ్యంగా ఉంచుకునేందుకు అధిక ప్రాధాన్యతను ఇస్తుంటారు. జుట్టు బలహీనంగా, చిట్లిపోయి ఉంటే ఎవరికీ తృప్తిగా ఉండదు. కనుక శిరోజాలను కాంతివంతంగా, అందంగా కనిపించేలా అనేక చిట్కాలను పాటిస్తుంటారు. మహిళలు తమ జుట్టు ఆరోగ్యంగా ఉండడమే కాకుండా పొడవుగా పెరగాలని కూడా కోరుకుంటారు. కానీ చాలా మందిని జుట్టు రాలే సమస్య ఇబ్బందులకు గురి చేస్తుంటుంది. అయితే ఈ సమస్య నుంచి బయట పడేందుకు ఖరీదైన చికిత్సలను ఉపయోగించాల్సిన పనిలేదు. ఖరీదైన క్రీములు, ఆయిల్స్‌ను కూడా వాడాల్సిన పనిలేదు. ఇంట్లోనే సహజసిద్ధంగా ఓ ఆయిల్‌ను తయారు చేసి వాడవచ్చు. దీంతో జుట్టు రాలడం తగ్గడంతోపాటు ఇతర జుట్టు సమస్యలు కూడా పోతాయి.
మీరు మీ ఇంట్లో లభించే కొన్ని సహజసిద్ధమైన పదార్థాలతోనే ఆయిల్‌ను తయారు చేయవచ్చు. దీన్ని రోజువారి దినచర్యలో భాగంగా ఉపయోగించవచ్చు. దీంతో జుట్టు సమస్యలు తగ్గుతాయి. మీరు షాంపూ వాడిన ప్రతిసారి జుట్టుకు ఆయిల్ రాయాల్సి ఉంటుంది. దీంతో జుట్టు సమస్యలు రావు. ఇప్పుడు చెప్పబోయే సహజసిద్ధమైన పదార్థాలు చాలా శక్తివంతమైనవి. కానీ వీటితో ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు. ప్రస్తుత తరుణంలో చాలా మంది జుట్టు రాలే సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు. అలాగే జుట్టును పొడవుగా పెరగాలని కూడా కోరుకుంటున్నారు. కనుక ఈ చిట్కాను పాటిస్తే ఈ సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ఇక హెయిర్ ఆయిల్‌ను ఎలా తయారు చేయాలి, అందుకు కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఇంట్లోనే మీరు హెయిర్ ఆయిల్‌ను తయారు చేసేందుకు గాను కొద్దిగా బెల్లం, 300 గ్రాముల కొబ్బరినూనె, నాలుగు టేబుల్ స్పూన్ల మెంతులు, గుప్పెడు కరివేపాకులు, 3 టేబుల్ స్పూన్ల రోజ్ మేరీ ఆకులు అన్నింటినీ తీసుకోవాలి. మీ జుట్టుకు ఈ అన్ని రకాల ఆకులు ఎంతగానో ఉపయోగపడతాయి. వీటితో తయారు చేసే ఆయిల్ చుండ్రును కూడా తగ్గిస్తుంది. జుట్టు రాలడం ఆగుతుంది. జుట్టు పొడవుగా పెరిగి ఒత్తుగా మారుతుంది. ఈ ఆయిల్‌ను ఇలా తయారు చేయాలి.
ముందుగా ఒక పాత్ర తీసుకుని స్టవ్‌పై పెట్టి స్టవ్‌ను వెలిగించాలి. అనంతరం అందులో కొబ్బరినూనె వేయాలి. తరువాత రోజ్మేరీ ఆకులు, కరివేపాకులు, మెంతులు, బెల్లం వేసి బాగా మరిగించాలి. 15 నుంచి 20 నిమిషాల పాటు స్టవ్‌ను సిమ్‌లో పెట్టి మరిగిస్తే ఆయిల్ వస్తుంది. దీన్ని సేకరించాలి. అనంతరం ఈ ఆయిల్‌ను ఒక సీసాలో పోసి నిల్వ చేయాలి. ఎండ తగలని చోట ఈ ఆయిల్‌ను పెట్టాలి. దీన్ని ఒక రోజు తరువాత నుంచి ఉపయోగించవచ్చు.
ఈ ఆయిల్‌ను ముందుగా మీరు షాంపూతో తలస్నానం చేయడానికి 2 గంటల ముందు జుట్టుకు బాగా అప్లై చేయాలి. లేదా రాత్రి అప్లై చేసి ఉదయం తలస్నానం చేయవచ్చు. ఈ నూనెను మీరు వారంలో కనీసం 2 నుంచి 3 సార్లు వాడుతుండాలి. దీంతో శిరోజాలు ఒత్తుగా పెరిగి కాంతివంతంగా మారుతాయి. ఈ ఆయిల్‌ను నేరుగా ఉపయోగించవచ్చు. లేదా ఏదైనా ఇతర నూనెతో కలిపి కూడా వాడుకోవచ్చు. ఇలా నాచురల్ ఆయిల్‌ను మీరు ఇంట్లోనే తయారు చేసి ఉపయోగించడం వల్ల అన్ని రకాల జుట్టు సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది.