Aspirin | ఆస్పిరిన్ రెగ్యులర్‌గా వాడుతున్నారా? అయితే, ఈ విషయాలు తెలుసుకోండి..!!
జ్వరం లేదా నొప్పికి సాధారణంగా ఉపయోగించే ఔషధం ఆస్పిరిన్. తలనొప్పి లేదా కాళ్లు/కీళ్లలో తేలికపాటి నొప్పి, కొన్నిసార్లు జ్వరాన్ని తగ్గించేందుకు వైద్యులు దీన్ని సిఫార్సు చేస్తారు. హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని నివారించేందుకు కూడా వైద్యులు దీన్ని రాస్తారు. ఇది సాధారణంగా ప్రిస్క్రిప్షన్ లేకుండా మెడికల్ షాపుల్లో అమ్మరు.
జ్వరం లేదా నొప్పికి సాధారణంగా ఉపయోగించే ఔషధం ఆస్పిరిన్. తలనొప్పి లేదా కాళ్లు/కీళ్లలో తేలికపాటి నొప్పి, కొన్నిసార్లు జ్వరాన్ని తగ్గించేందుకు వైద్యులు దీన్ని సిఫార్సు చేస్తారు. హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని నివారించేందుకు కూడా వైద్యులు దీన్ని రాస్తారు. ఇది సాధారణంగా ప్రిస్క్రిప్షన్ లేకుండా మెడికల్ షాపుల్లో అమ్మరు.
ఆస్పిరిన్‌తో చాలా లాభాలున్నా దుష్ప్రభావాలను కూడా కలిగి ఉంటుంది. ఇది అల్సర్లు లేదా గుండెల్లో మంట లేదా చాతీ నొప్పిలాంటి వాటికి కారణమవుతుంది. అందువల్ల ఆస్పిరిన్ తీసుకునే మోతాదును చెక్ చేసుకోవాలి. రెగ్యులర్‌గా ఆస్పిరిన్ వాడే వారు కచ్చితంగా ఈ విషయాలు తెలుసుకోవాలి.
శరీరంపై ఆస్పిరిన్ ఎలా పనిచేస్తుందంటే?
- ఆస్పిరిన్ గుండె జబ్బులు, స్ట్రోక్‌ల అవకాశాలను తగ్గిస్తుంది. మీరు ఇంతకు ముందు గుండెపోటుతో బాధపడినట్లయితే పరిమిత మోతాదులో ఆస్పిరిన్‌ను వైద్యులు సూచిస్తారు. ఇది బ్లడ్ క్లాట్స్‌ను నివారిస్తుంది.
- ఆస్పిరిన్.. యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది. దీన్ని నాన్-స్టెరాయిడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్ (ఎన్ఎస్ఏఐడీ) అని కూడా పిలుస్తారు. ఇది వాపులను తగ్గించడంలో సహాయపడుతుంది. తలనొప్పి, జ్వరాలతోపాటు కీళ్లు, కండరాల నొప్పులను తగ్గించేందుకు ఎన్ఎస్ఏఐడీ నొప్పి నివారిణిగా కూడా పనిచేస్తుంది.
- ఆస్పిరిన్ రక్తస్రావం కలిగిస్తుంది. ఈ రక్తస్రావం సాధారణంగా కడుపు లేదా మెదడు లేదా పేగుల్లో సంభవించే అంతర్గత రక్తస్రావం. ఇది గుండెపోటు ప్రమాదాన్ని తగ్గించినప్పటికీ, రోజువారీ వినియోగం రక్తస్రావం కలిగిస్తుంది.
- ఆస్పిరిన్ కడుపులో అల్సర్లకు కారణం కావొచ్చు. ఆస్పిరిన్లాంటి పెయిన్ కిల్లర్లు కడుపులో సమస్యలను సృష్టిస్తాయి. అవి కడుపు లైనింగ్‌ను చికాకుపెడతాయి, ఇది రక్తస్రావం, అల్సర్లకు దారితీయొచ్చు. ఎక్కువగా మద్యం తాగేవారిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Water conservation | నీటి కోసం స్ఫూర్తిగా నిలిచిన.. ఆదర్శ నగర్ కాలనీ వాసులు
Heart Diseases | పండుగ సమయంలో గుండె జబ్బుల ముప్పు ఎక్కువ.. హృదయ ఆరోగ్యాన్ని ఇలా కాపాడుకోండి..
Two students die | ప్రాణాలు తీసిన సెలవుల సరదా.. క్వారీ గుంతలో పడి ఇద్దరు విద్యార్థులు మృతి
డిండి ప్రాజెక్టు పనులను వేగంగా పూర్తి చేయాలి : జూలకంటి రంగారెడ్డి
Madhyapradesh | ఉజ్జయినిలో పెను విషాదం.. విషవాయువు పీల్చి నలుగురు హోటల్ కార్మికులు మృతి
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

