ఎలాంటి లక్షణాలు కనిపించకుండా కేవలం బ్లడ్ టెస్ట్‌తో తెలుసుకునే కొలెస్ట్రాల్ సైలెంట్ కిల్లర్ (Health Tips)అని వైద్యులు చెబుతుంటారు. అధిక కొలెస్ట్రాల్ లెవెల్స్‌తో హృద్రోగాల ముప్పు పొంచిఉంటుంది. కొలెస్ట్రాల్ లెవెల్స్‌ను తెలుసుకుని అదుపులో ఉంచుకోకుంటే అది ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంది. చెడు కొలెస్ట్రాల్‌గా పరిగణించే ఎల్‌డీఎల్‌ను నియంత్రించేందుకు జీవనశైలి మార్పులతో పాటు ఆహారం కీలక పాత్ర పోషిస్తుంది.
ఆరోగ్యకరమైన, ఇమ్యూనిటీని పెంచే డ్రింక్స్తోనూ కొలెస్ట్రాల్ లెవెల్స్‌ను తగ్గించుకోవచ్చు. చెడు కొలెస్ట్రాల్ 1 శాతం తగ్గినా 1 శాతం హృద్రోగ ముప్పు తగ్గుతుందని వైద్యులు చెబుతున్నారు. మొత్తం కొలెస్ట్రాల్ ఒక శాతం తగ్గితే గుండె సమస్యలు వచ్చే ముప్పు 3 శాతం తగ్గుతుందని చెబుతున్నారు. ఇందుకు మూడు ఆరోగ్యకర పానీయాలను క్రమం తప్పకుండా తీసుకుంటే మెరుగైన ఫలితాలు ఉంటాయని సూచిస్తున్నారు.
ఇక ఆరోగ్యానికి అద్భుతంగా పనిచేసే పానీయంగా గ్రీన్ టీ ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందింది. ఆరోగ్యవంతులతో పాటు అధిక కొలెస్ట్రాల్ లెవెల్స్ కలిగిన వారికీ గ్రీన్ టీ దివ్యౌషధంగా పనిచేస్తుంది. గ్రీన్‌టీ ఊబకాయంతో బాధపడేవారికీ మేలు చేస్తుంది. గ్రీన్ టీతో టోటల్ కొలెస్ట్రాల్, ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ అదుపులోకి వస్తుంది. ఇది మంచి కొలెస్ట్రాల్ (హెచ్‌డీఎల్)ను ఏమాత్రం తగ్గించదు. గ్రీన్‌టీ తీసుకుంటే హైపర్లిపిడెమియా నుంచి రక్షణ ఉంటుందని న్యూట్రిషనల్ జర్నల్ బీఎంసీలో ప్రచురితమైన అధ్యయనం పేర్కొంది. గ్రీన్‌టీతో పాటు నిత్యం సోయా పాలు, దానిమ్మ జ్యూస్ తీసుకుంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గుతాయని నిపుణులు సూచిస్తున్నారు.
Read More