Onion For Hair Growth | ప్రస్తుతం జుట్టు రాలిపోయే సమస్యతో అధిక శాతం మంది ఇబ్బందులు పడుతున్నారు. ఇందుకు అనేక కారణాలు ఉంటున్నాయి. పోషకాహార లోపం, కాలుష్యం, ఒత్తిడి, ఆందోళన అధికంగా ఉండడం, దీర్ఘకాలికంగా పలు వ్యాధులు ఉండడం, మందులను వాడడం వంటి అనేక కారణాల వల్ల చాలా మందికి జుట్టు రాలుతోంది. ఇక పురుషులకు అయితే బట్టతల సమస్య కూడా వస్తోంది. అయితే జుట్టు రాలే సమస్యకు ఉల్లిపాయ చక్కని పరిష్కారాన్ని చూపిస్తుంది. ఉల్లిపాయను పలు ఇంటి చిట్కాల్లో పలు రకాలుగా ఉపయోగించాలి. దీని వల్ల జుట్టు రాలడాన్ని తగ్గించవచ్చు. శిరోజాలు ఒత్తుగా పెరిగి దృఢంగా, ఆరోగ్యంగా ఉంటాయి. ఇతర జుట్టు సమస్యలు కూడా తొలగిపోతాయి. శిరోజాలు కాంతివంతంగా మారి మెరుస్తాయి. జుట్టు చిట్లిపోవడం తగ్గుతుంది. తలలో ఉండే దురద, చుండ్రు నుంచి సైతం ఉపశమనం లభిస్తుంది. ఇందుకు గాను ఉల్లిపాయలను పలు రకాలుగా వాడాల్సి ఉంటుంది.
జుట్టు సమస్యలను తగ్గించేందుకు ఉల్లిపాయలు బాగా పనిచేస్తాయి. కొన్ని ఉల్లిపాయలను తీసుకుని ముక్కలుగా కట్ చేసి అనంతరం వాటిని మిక్సీలో వేసి మెత్తని పేస్ట్‌లా పట్టుకోవాలి. అనంతరం ఆ మిశ్రమాన్ని నేరుగా జుట్టు కుదుళ్లకు తగిలేలా బాగా మర్దనా చేయాలి. ఉల్లిపాయ గుజ్జు మరీ ఘాటుగా ఉంటుందని భావిస్తే కొన్ని నీళ్లను కలిపి వాడవచ్చు. తరువాత 30 నిమిషాల పాటు ఆగి తలస్నానం చేయాలి. ఇలా వారంలో కనీసం 2 సార్లు చేయాల్సి ఉంటుంది. దీని వల్ల జుట్టు రాలడాన్ని తగ్గించవచ్చు. శిరోజాలు ఒత్తుగా పెరిగి దృఢంగా, ఆరోగ్యంగా ఉంటాయి. ఉల్లిపాయల్లో సల్ఫర్ అధికంగా ఉంటుంది. ఇది అన్ని రకాల జుట్టు సమస్యలను తగ్గిస్తుంది. దీంతో శిరోజాలు సురక్షితంగా ఉంటాయి. తలలో ఉండే ఇన్ఫెక్షన్ సైతం తగ్గిపోతుంది.
ఇక ఉల్లిపాయలతో కొబ్బరినూనెను కూడా కలిపి వాడుకోవచ్చు. ఉల్లిపాయలను మెత్తగా చేసిన తరువాత అందులో కొద్దిగా కొబ్బరినూనెను కలిపి మిశ్రమంగా మార్చాలి. దీన్ని తలకు బాగా మర్దనా చేయాలి. 30 నిమిషాలు అయ్యాక తలస్నానం చేయాలి. ఇలా వారంలో 2 సార్లు చేయాల్సి ఉంటుంది. దీని వల్ల అన్ని రకాల జుట్టు సమస్యల నుంచి బయట పడవచ్చు. శిరోజాలు రాలడం తగ్గుతుంది. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. చుండ్రు నుంచి ఉపశమనం లభిస్తుంది. తలలో ఉండే దురద సైతం తగ్గుతుంది. ఇక ఉల్లిపాయల గుజ్జులో కొద్దిగా తేనె, నిమ్మరసం కలిపి కూడా వాడవచ్చు. ఇది కూడా అద్భుతంగా పనిచేస్తుంది. ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్లకు తగిలేలా పట్టించాలి. 30 నిమిషాలు అయ్యాక తలస్నానం చేయాలి. ఇలా వారంలో 2 సార్లు చేస్తుంటే ఫలితం ఉంటుంది. అన్ని రకాల జుట్టు సమస్యలను తగ్గించుకోవచ్చు.
ఉల్లిపాయల గుజ్జులో కలబంద గుజ్జును కలిపి జుట్టుకు రాస్తున్నా కూడా ఎంతగానో ఉపయోగం ఉంటుంది. కలబందలో యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ మైక్రోబియల్ గుణాలు ఉంటాయి. కనుక ఉల్లిపాయలు, కలబంద మిశ్రమాన్ని జుట్టుకు రాస్తుంటే జుట్టులో ఉండే ఇన్ఫెక్షన్ తొలగిపోతుంది. దురద తగ్గుతుంది. చుండ్రు నుంచి ఉపశమనం లభిస్తుంది. జుట్టు రాలడం తగ్గిపోతుంది. శిరోజాలు ఒత్తుగా పెరిగా ఆరోగ్యంగా ఉంటాయి. అలాగే ఉల్లిపాయల గుజ్జులో రోజ్ వాటర్‌ను కూడా కలపవచ్చు. దీన్ని కలపడం వల్ల జుట్టు ఉల్లిపాయల వాసన రాకుండా ఉంటుంది. అలాగే జుట్టుకు పోషణ కూడా లభిస్తుంది. శిరోజాలు కాంతివంతంగా మారి మెరుస్తాయి. ఈ విధంగా ఉల్లిపాయల గుజ్జును ఉపయోగిస్తుంటే అన్ని రకాల శిరోజాల సమస్యలను సులభంగా తగ్గించుకోవచ్చు.