బట్టతలతో బాధపడుతున్నారా? ఇదిగో గుడ్‌న్యూస్

ఒక్కసారి బట్టతల వచ్చిందంటే, తలమీద జుట్టు తెప్పించడం హరిహరాదులకైనా అసాధ్యమే. దీంతో, అకాలపు బట్టతలతో బాధపడేవారు జుట్టు మీద ఆశలు వదిలేసుకుంటారు. అలాంటివారిని ‘బట్టతల ఉంటే అదృష్టమోయ్’ అని ఊరడిస్తుంటారు ఆప్తులు. ఎవరెంత ఓదార్చినా, మనసులో బాధ మెలిపెడుతూనే ఉంటుంది. ఇన్నేండ్లు బట్టతలపై జుట్టు రావడం అసాధ్యమని అందరూ అనుకున్నారు. కానీ, టెక్నాలజీ చేయని ఇంద్రజాలమంటూ ఉంటుందా? కుదుళ్ల ప్రాంతానికి నానో కణాలను పంపి, వెంట్రుకలు మొలిచేలా చేయవచ్చని తేలిపోయింది.
ఈ ఫార్ములా ప్రకారం ఎలుకలపై నిర్వహించిన ప్రాథమిక ప్రయోగం విజయవంతమైందని అమెరికన్ కెమికల్ సొసైటీ పరిశోధకులు చెబుతున్నారు. జుట్టు రాలే ప్రక్రియను ‘ఆండ్రోజెనిక్ అలొపేసియా’ అంటారు. వాడుక భాషలో బట్టతలగా పిలుస్తాం. దీనికి ముఖ్యకారణం మాడు భాగానికి పోషకాలను సరఫరా చేసే ఫాలికల్స్ చుట్టూ రక్తనాళాలు లేకపోవడమే. దీనికితోడు వెంట్రుకలు పెరిగేందుకు, కొత్తవి పుట్టుకొచ్చేందుకు తోడ్పడే కణాలు చనిపోతూ ఉంటాయి. ఈ అవరోధాలకు చెక్ పెట్టేందుకు పరిశోధకులు నానో కణాలను ప్రయోగిస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Hair Loss : జుట్టు రాలడం ఆగాలంటే ఏం చేయాలి.. రోజూ షాంపూ పెట్టొచ్చా ?
Post Corona symptoms : కరోనా తగ్గాక జుట్టు రాలుతుందా? ఇలా ట్రై చేయండి
దాంపత్య జీవితంపై ఆసక్తి తగ్గుతున్నది.. ఎందుకు?
Diabetes | ఫాస్ట్‌ఫుడ్ తింటే డయాబెటిస్ వస్తుందా?
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

