మంగళవారం 26 మే 2020
Health - May 21, 2020 , 15:57:54

ఒంట్లో వేడిని తగ్గించే చిట్కాలు ఏంటో తెలుసా..?

ఒంట్లో వేడిని తగ్గించే చిట్కాలు ఏంటో తెలుసా..?

హైదరాబాద్‌: వేసవి కాలంలో సాధారణంగా ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఈ ఎండలవల్ల శరీర ఉష్ణోగ్రతలు హెచ్చుతగ్గులకు లోనవుతాయి. శరీరం డీహైడ్రేషన్‌కు గురవుతుంది. దీనివల్ల ఒళ్లు అలసిపోయి నీరసం ఆవహిస్తుంది. మరి ఈ పరిస్థితి రావద్దంటే శరీర ఉష్ణోగ్రతలు పెరుగకుండా చూసుకోవాలి. కొన్ని చిన్నచిన్న చిట్కాలు పాటించడం ద్వారా శరీర ఉష్ణోగ్రతలను తగ్గించుకోవచ్చు. మరి ఆ చిట్కాలు ఏంటో ఒకసారి చూద్దామా..?

  •  ఒంటికి వేడిచేసే ఆహార పదార్థాలైన పుల్లటి పండ్లు, బీట్‌రూట్‌లు, క్యారెట్‌లను వేసవిలో ఎక్కువగా తినకూడదు.  
  •  దానిమ్మ పండులో శరీరంలో వేడిని తగ్గించే లక్షణం ఉంది. రెండుమూడు రోజులకు ఒకసారైనా దానిమ్మ గింజలు తినడం లేదా దానిమ్మ రసం తాగడంవల్ల శరీరం చల్లగా ఉంటుంది.
  •  నిమ్మ రసం, కొబ్బరి నీళ్లు తాగడం ద్వారా కూడా శరీరం చల్లబడుతుంది. 
  •  రోజూ ఉదయం కొబ్బరి నూనె లేదా పొద్దు తిరుగుడు నూనెతో శరీరానికి మర్ధన చేసుకుని స్నానం చేయడంవల్ల శరీరం చల్లబడుతుంది.  
  •  రోజూ రెండు కప్పులు తాటి బెల్లం కలిపిన నీళ్లను తాగడం ద్వారా కూడా శరీరంలో వేడిని తగ్గించుకోవచ్చు. 
  •  క్రమం తప్పకుండా ఎర్ర మందారం టీ తాగడంవల్ల శరీర ఉష్ణోగ్రతలు తగ్గుతాయి.


logo