Weight Loss : బరువు తగ్గడం అనేది అంత సులభమైన ప్రక్రియ ఏమీ కాదు. కోరుకున్న లక్ష్యం చేరుకునేందుకు రాజీ పడుతూ కఠిన ఆహార, వ్యాయామ నియమాలను అనుసరించాలి. ఇవి ఎంతటి క్లిష్టమో ఆరోగ్యకరమైన స్నాక్స్‌ను గుర్తించి వాటిని నిత్యం తీసుకోవడం మరింత కష్టం.
అయితే తక్కువ క్యాలరీలతో పాటు అధిక ప్రొటీన్, ఫైబర్‌తో కూడిన ఆహార పదార్ధాలను హెల్ధీ స్నాకింగ్‌గా ఎంచుకోవాలని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. బరువు తగ్గే ప్రాసెస్‌లో స్నాక్స్‌ను పూర్తిగా దూరం పెట్టాలనే నియమం లేదు. బరువు తగ్గే ప్రక్రియకు ఊతమిచ్చేలా తక్కువ క్యాలరీలతో కూడిన ఆరోగ్యకరమైన స్నాక్స్‌ను ఎంపిక చేసుకోవచ్చు. ముందుగా పండ్లలో రారాజుగా చెప్పే యాపిల్‌ను స్నాక్స్‌గా తరచూ తీసుకోవచ్చు.
రోజూ ఓ యాపిల్ తీసుకుంటే వైద్యుడి అవసరం కూడా ఉండదని చెబుతుంటారు. యాపిల్‌లో ఉండే ఫైబర్‌తో కడుపు నిండిన భావనతో ఆహారం పెద్దగా తీసుకోం. వంద గ్రాముల యాపిల్ కేవలం 50 క్యాలరీలే కలిగిఉంటుంది. అయితే వీటిలో షుగర్ ఉండటంతో పరిమితంగా తీసుకోవడం మేలు. ఇక ఆరోగ్యకరమైన స్నాక్స్ విషయానికి వస్తే ఈ ఆహార పదార్ధాలను వెయిట్ లాస్ జర్నీలో ఎవరైనా నిరభ్యంతరంగా తీసుకోవచ్చు
యాపిల్స్
పాప్‌కార్న్
బాదం
మఖానా
స్ట్రాబెర్రీస్
Read More :
Delhi Man Stomped By Bull | కుమారుడి కోసం స్కూల్‌కు వెళ్లిన వ్యక్తి.. ఆవు దాడిలో మృతి