Health tips | విటమిన్ B12 లోపాన్ని లైట్ తీసుకుంటున్నారా.. గుండెకు, లివర్‌కు ప్రమాదమట తెలుసా..?
Health tips | మనం ఆరోగ్యంగా ఉండాలంటే ముఖ్యంగా సమతుల ఆహారం తీసుకోవాలి. విటమిన్లు (Vitamins), మినరల్లు (Minerals) సమపాళ్లలో ఉండేలా చూసుకోవాలి. లేదంటే పోషకలోప సంబంధ రుగ్మతలు తలెత్తుతాయి. ఈ పోషక లోపాల్లో ముఖ్యంగా విటమిన్ B12 లోపాన్ని ఏమాత్రం అలక్ష్యం చేయకూడదు. ఎందుకంటే విటమిన్ B12 లోపంవల్ల రక్తహీనత సమస్య వచ్చే ప్రమాదం ఉంటుంది.
Health tips : మనం ఆరోగ్యంగా ఉండాలంటే ముఖ్యంగా సమతుల ఆహారం తీసుకోవాలి. విటమిన్లు (Vitamins), మినరల్లు (Minerals) సమపాళ్లలో ఉండేలా చూసుకోవాలి. లేదంటే పోషకలోప సంబంధ రుగ్మతలు తలెత్తుతాయి. ఈ పోషక లోపాల్లో ముఖ్యంగా విటమిన్ B12 లోపాన్ని ఏమాత్రం అలక్ష్యం చేయకూడదు. ఎందుకంటే విటమిన్ B12 లోపంవల్ల రక్తహీనత సమస్య వచ్చే ప్రమాదం ఉంటుంది. B12 లోపంవల్ల మొదట్లో కొద్దిగా మైకం కమ్మినట్లుగా, మగతగా ఉంటుంది. తేలిగ్గా తీసుకుంటే క్రమంగా అతిసారం, గ్లోసిటిస్ (స్మూత్ టంగ్) లాంటి సమస్యల బారినపడాల్సి వస్తుంది. వ్యాధి మరింత ముదిరితే నాడీ సంబంధ సమస్యలు కూడా వస్తాయి.
ఆ తర్వాత బాబిన్స్కీ రిఫ్లెక్స్ సంభవిస్తుంది. అంటే అరికాలుపై కొట్టినప్పుడు పాదానికి ఉన్న మిగిలిన అన్నివేళ్లు కిందికి వంగుతుంటే బొటనవేలు మాత్రం పైకి లేస్తుంది. అయితే రెండేండ్లలోపు పిల్లలలో ఈ రిఫ్లెక్షన్ సాధారణమేనని నేషనల్ లైబ్రెరీ ఆఫ్ మెడిసిన్ నిపుణులు తెలిపారు. కానీ పెద్దవారిలో ఈ రిఫ్లెక్షన్ కనిపిస్తే అది కేంద్ర నాడీవ్యవస్థకు సంబంధించిన రుగ్మతకు సంకేతమని చెప్పారు. అంటే అప్పుడప్పుడు అరికాళ్లపై తట్టి చూసుకోవడం ద్వారా విటమిన్ బి12 స్థాయిలు బాగా పడిపోయిన విషయాన్ని అంచనా వేయవచ్చు.
సాధారణంగా విటమిన్ బి12 శోషణకు జీర్ణాశయ గోడల్లోని పార్శ్వకణాల నుంచి స్రవించబడే అంతర్గత కారకం అవసరం. హానికర రక్తహీనతతో బాధపడుతున్న వారిలో విటమిన్ బి12ను శోషించుకునే అంతర్గత కారకం లోపిస్తుంది. ఎందుకంటే ఈ హానికర రక్తహీనత అనేది జీర్ణాశయ క్షీణతతో సంబంధం కలిగి ఉంటుంది. జీర్ణాశయ గోడల్లోని పార్శ్వ కణాలు పూర్తిగా లేదా పాక్షికంగా లోపించడం జీర్ణాశయ క్షీణతకు దారితీస్తుంది.
40 నుంచి 60 ఏండ్ల మధ్య వయసు వారి నుంచి 15 శాతం మందిలో, వృద్ధులైన పేషెంట్లలో 20 నుంచి 30 శాతం మందిలో ఈ జీర్ణాశయ క్షీణత కనిపిస్తుంది. అరవై ఏండ్లకు అటుఇటు వయసు ఉన్నవాళ్లలో సాధారణంగా ఈ జీర్ణాశయ క్షీణత సంభవిస్తుంది. అదేవిధంగా నీలం రంగు కళ్లు, A బ్లడ్ గ్రూప్ ఉన్న పేషెంట్లకు జీర్ణాశయ క్షీణత రావచ్చు. వంశపారంపర్యంగా కూడా ఈ రుగ్మత వచ్చే అవకాశం ఉన్నది.
బి12 లోపం లక్షణాలు
శ్వాస తీసుకోవడం భారంగా అనిపిస్తుంది. తీసుకున్న ఆహారం త్వరగా జీర్ణం కాదు. వేగంగా బరువు తగ్గిపోతారు. ప్రతిస్పందన లోపం వస్తుంది. కండరాలపై నియంత్రణ కోల్పోతారు. తీవ్రమైన కేసులలో కొందరు పేషెంట్లలో గుండె వైఫల్యం, కాలేయవాపు లాంటి సమస్యలు వస్తాయి. ఇలాంటి కేసులలో మానసిక మార్పులు సంభవిస్తాయి. అంటే ఒత్తిడి, మతిస్థిమితం కోల్పోవడం, మృత్యుభయం లాంటి లక్షణాలు కనిపిస్తాయి.
విటమిన్ బి12 స్థాయిలు 150ng/l కంటే తక్కువగా ఉంటే దాన్ని లోపంగా చెప్పవచ్చు. రక్త పరీక్షల ద్వారా ఈ విటమిన్ బి12 స్థాయిలను అంచనా వేయవచ్చు. రక్తంలో హీమోగ్లోబిన్ స్థాయిలు, ఎర్ర రక్తకణాల పరిమాణం, విటమిన్ బి12 స్థాయిలు, ఫోలేట్ స్థాయిలు రక్తపరీక్షల్లో తేలుతాయి. హానికర రక్తహీనత ఉందో లేదో తెలుసుకోవడానికి మరికొన్ని రక్త పరీక్షలు చేయాల్సి ఉంటుంది. అయితే అందరికీ ఈ హానికర రక్తహీనత పరీక్షలు అక్కర్లేదు. రోగి కండిషన్‌ను బట్టి ఈ పరీక్షలు చేయాల్సి ఉంటుంది.
ఒకవేళ రోగిలో హానికర రక్తహీనత ఉన్నట్లు తేలితే హైడ్రాక్సోకోబాలమిన్ ఇంజక్షన్ల ద్వారా చికిత్స చేస్తారు. హైడ్రాక్సోకోబాలమిన్ అనేది విటమిన్ బి12కు సింథటిక్ వెర్షన్. ప్రతి మూడు నెలలకు ఒకసారి ఈ ఇంజక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ చికిత్స జీవితాంతం కొనసాగుతుంది. ట్రీట్మెంట్ సరిగా పనిచేస్తుందా లేదా అని తెలుసుకోవడానికి మరికొన్ని రక్తపరీక్షలు అవసరమవుతాయి.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health tips | విటమిన్ B12 లోపాన్ని లైట్ తీసుకుంటున్నారా.. గుండెకు, లివర్‌కు ప్రమాదమట తెలుసా..?
KCR | కేసీఆర్‌తో ఆదిలాబాద్ యువనేత భార్గవ్ దేశ్‌పాండే భేటీ
Delhi Air Pollution | ఢిల్లీలో పెరుగుతున్న ఎయిర్ పొల్యూషన్.. 325కి పడిపోయిన ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్..!
బౌరంపేటలో భారీ అగ్నిప్రమాదం.. ఐదు ట్రావెల్స్ బస్సులకు మంటలు.. మూడు బస్సులు దగ్ధం!
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video
ట్రెండింగ్ వార్తలు
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!

