Health tips | పాడైపోయిన కోడిగుడ్డు ఆరోగ్యానికి హానికరం.. మరి గుర్తించడం ఎలాగో తెలుసా..?
Health tips | డిగుడ్లు (Eggs) మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అందుకే ఆరోగ్య నిపుణులు (Health Experts) తరచూ ఒక గుడ్డు తినాలని సూచిస్తుంటారు. కానీ కోడిగుడ్లలో పాడైపోయిన గుడ్లు కూడా ఉంటాయి. ఇలాంటి గడువు ముగిసిన లేదా పాడైపోయిన గుడ్లను తినడం వల్ల ఫుడ్ పాయిజనింగ్ (Food poisoning) జరుగుతుంది. తద్వారా ఆరోగ్యం దెబ్బతింటుంది. అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.
Health tips : కోడిగుడ్లు (Eggs) మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అందుకే ఆరోగ్య నిపుణులు (Health Experts) తరచూ ఒక గుడ్డు తినాలని సూచిస్తుంటారు. కానీ కోడిగుడ్లలో పాడైపోయిన గుడ్లు కూడా ఉంటాయి. ఇలాంటి గడువు ముగిసిన లేదా పాడైపోయిన గుడ్లను తినడం వల్ల ఫుడ్ పాయిజనింగ్ (Food poisoning) జరుగుతుంది. తద్వారా ఆరోగ్యం దెబ్బతింటుంది. అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి గుడ్లు వాడే ముందు వాటి నాణ్యతను పరీక్షించడం చాలా అవసరం. పాడైపోయిన గుడ్లలో సాల్మొనెల్లా (Salmonella) వంటి హానికరమైన బ్యాక్టీరియా పెరుగుతుంది. ఇవి శరీరంలోకి వెళ్లినప్పుడు కడుపునొప్పి, విరేచనాలు, వాంతులు, డీహైడ్రేషన్ (Dehydration) వంటి సమస్యలు కలుగుతాయి. చిన్నపిల్లలు, వృద్ధులకు ఇది మరింత ప్రమాదకరం. పాడైపోయిన గుడ్లు తింటే ఏం జరుగుతుందో ఇప్పుడు చూద్దాం..
వికారం, వాంతులు
పాడైన గుడ్లు తింటే శరీరంలో విషపదార్థాలు పెరిగి వెంటనే వికారం, వాంతులు, తల తిరగడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
జ్వరం, నీరసం
పాడైపోయిన గుడ్లవల్ల బాక్టీరియా ఇన్ఫెక్షన్ పెరిగితే శరీరం దానితో పోరాడేందుకు ఉష్ణోగ్రత పెంచుతుంది. దాంతో జ్వరం వస్తుంది. అలాగే అలసట, నీరసంగా కూడా అనిపిస్తుంది.
రోగనిరోధక శక్తి బలహీనం
గడువు ముగిసిన గుడ్లు తింటే రోగనిరోధక శక్తి కూడా బలహీనమవుతుంది. దాంతో చిన్నచిన్న వ్యాధులు కూడా త్వరగా అంటుకుంటాయి.
గుర్తించడం ఎలా..?
పాడైపోయిన గుడ్లు ఏవి.. బాగున్న గుడ్లు ఏవీ అని గుర్తించేందుకు ఒక పరీక్ష ఉంది. గుడ్లు బాగున్నాయా.. లేదా అని తెలుసుకునేందుకు ముందుగా వాటిని నీళ్లలో వేయాలి. తాజా గుడ్డు అయితే పూర్తిగా నీళ్లలో మునిగిపోతుంది. పాడైపోయిన గుడ్డు నీళ్లపై తేలుతుంది. అలా నీటిపై తేలిన గుడ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ తినకూడదు. గుడ్లు ఆరోగ్యానికి చాలా మంచివి. కానీ వాటి నాణ్యతపై జాగ్రత్త కూడా అవసరం. గడువు ముగిసిన గుడ్లు తినకుండా ముందుగా చెక్ చేసుకోవడం ద్వారా ఫుడ్ పాయిజనింగ్ వంటి సమస్యల నుంచి దూరంగా ఉండవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

