Garlic Health benefits | చలికాలం.. వెల్లుల్లి సాయం!
శీతకాలంలో ఇబ్బందిపెట్టే శ్వాసకోశ, జీర్ణ సంబంధ రోగాలకు వెల్లుల్లి గొప్ప పరిష్కారమని అంటున్నారు పోషక నిపుణులు. దీనిని రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. వెల్లుల్లిలో క్యాల్షియం, ఐరన్, విటమిన్-సి, బి6, ఫోలేట్, మెగ్నీషియం, సెలీనియం, పొటాషియం వంటివి పుష్కలం
Garlic Health benefits in Winter Season | శీతకాలంలో ఇబ్బందిపెట్టే శ్వాసకోశ, జీర్ణ సంబంధ రోగాలకు వెల్లుల్లి గొప్ప పరిష్కారమని అంటున్నారు పోషక నిపుణులు. దీనిని రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. వెల్లుల్లిలో క్యాల్షియం, ఐరన్, విటమిన్-సి, బి6, ఫోలేట్, మెగ్నీషియం, సెలీనియం, పొటాషియం వంటివి పుష్కలం. చలికాలపు వ్యాధులకు వణుకు పుట్టించే శక్తి వెల్లుల్లికే ఉంది.
» వెల్లుల్లిలో యాంటీవైరల్ లక్షణాలు అపారం. దగ్గు, జలుబు వంటి సీజనల్ వ్యాధులతో ఇవి సమర్థంగా పోరాడుతాయి.
» వెల్లుల్లి ఇమ్యునోమోడ్యులేటింగ్ ప్రభావాలను కలిగి ఉంటుంది. ఇందులోని అల్లిసిన్ శరీరంలో తెల్ల రక్తకణాల ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.
» వెల్లుల్లి శరీరానికి వెచ్చదనాన్ని ఇస్తుంది. చలికాలంలో ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది. గుండె, జీర్ణకోశ, శ్వాస వ్యవస్థలతో ముడిపడిన సమస్యలు వస్తుంటాయి. తరచూ వెల్లుల్లి సూప్ తీసుకుంటే.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఇది తామస, రాజస గుణాలను ప్రేరేపిస్తుందని ఆయుర్వేదం చెబుతున్నది.
» శీతకాలపు అలర్జీలకు వెల్లుల్లి సత్వర పరిష్కారం.
» ఈ సీజన్లో సీరం కొలెస్ట్రాల్ స్థాయులు పెరగడం వల్ల గుండెజబ్బుల ప్రమాదం ఎక్కువ. వెల్లుల్లిలోని పొటాషియం, మెగ్నీషియం చెడుకొలెస్ట్రాల్‌ను అడ్డుకుంటాయి.
» చల్లని వాతావరణం కారణంగా శరీరంలో జీవక్రియ నెమ్మదిస్తుంది. వెల్లుల్లిలోని సహజ ఔషధ గుణాలు ఆ ప్రక్రియను వేగవంతం చేస్తాయి.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

