Health tips : ఆరోగ్యం, దీర్ఘాయువు సొంతం కావాలంటే..!

లండన్ : ఉరుకుల పరుగుల జీవితంలో ఆటుపోట్లను తట్టుకుని నిత్యం సంతోషంగా నిలవగలిగే వారు పూర్తి ఆరోగ్యంతో ఎక్కువకాలం జీవిస్తారని పలు అధ్యయనాలు స్పష్టం చేయగా తాజాగా సంతోషానికి, మన ఆరోగ్యానికి సంబంధం ఉందని హార్వర్డ్ అధ్యయనం కూడా తేల్చిచెప్పింది. ఇక ప్రతివ్యక్తిలో సంతోషంగా ఉండటమనేది 50 శాతం జన్యుపరమైన అంశాలు నిర్ధారిస్తుండగా 40 శాతం మన చేతిలోనే ఉంటాయి. మిగిలిన పది శాతం పరిస్ధితులపై ఆధారపడి ఉంటాయని పరిశోధకులు చెబుతున్నారు.
మన చేతిలో ఉన్న అంశాలను అనుకూలంగా మార్చుకుని సంతోషంగా మలుచుకోవడమనేది మనం చక్కదిద్దుకోవాల్సి ఉంది. వ్యక్తిగతంగా స్నేహితులు, కుటుంబసభ్యులు, బంధువులతో మెరుగైన సంబంధాలు భావోద్వేగాలను చక్కగా నియంత్రిస్తాయని ఇది ఆటోమేటిక్‌గా మనలో మూడ్ బూస్టర్‌గా ఉంటుందని అధ్యయనానికి నేతృత్వం వహించిన డాక్ర్ వాల్డింగర్ తెలిపారు. మనలో ఉన్న బాల్యం తాలూకూ అనుభూతులను నిరంతరం అనుభవించాలని, నిత్యం సంతోషంగా ఉండే వారితో సాన్నిహిత్యంగా ఉండటం ద్వారా మనలోనూ సంతోషాన్ని నింపవచ్చని పరిశోధకులు చెబుతున్నారు.
ప్రకృతి ఒడిలో సేదతీరడం, పచ్చదనం ఉండే పరిసరాల్లో నడవడంతో పాటు రోజూ ఒకే తరహా పనిని చేయడం కంటే అదే పనిలో వైవిధ్యం కోసం ప్రయత్నించాలని సూచిస్తున్నారు. ఎంత బిజీగా ఉన్నా ఎంజాయ్ చేసేందుకు సమయాన్ని కేటాయించాలని, చిన్నపాటి వినోద, విహార యాత్రలూ తరచూ చేస్తుండాలని పరిశోధకులు పేర్కొన్నారు. అన్నింటికంటే ముఖ్యంగా పని ఒత్తిడిని మీద వేసుకోకుండా ఎప్పటి పనులు అప్పుడే ముగిస్తూ ముందుకెళ్లాలని చెబుతున్నారు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Symbols were tampered | ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో గుర్తులు తారుమారు..! నిలిచిన పోలింగ్
Hrithik Roshan | మన బంధం ఒక్క సినిమాతో ముగియలేదు.. దర్శకుడు సంజయ్ గుప్తా మృతిపై హృతిక్ ఎమోషనల్!
Road accident | గద్వాలలో కారు బీభత్సం.. ఒకరు మృతి, మరొకరి పరిస్థితి విషమం
SCENE Trailer | ‘సీన్’ ట్రైలర్ వచ్చేసింది.. అంచనాలు పెంచుతున్న సూర్య-నస్లెన్ మైండ్ గేమ్!
Bigg Boss 10 | హౌస్ నుంచి ఫోక్ సింగర్ ఝాన్సీ ఎలిమినేట్.. కన్నీళ్లు పెట్టుకున్న ముకేశ్ !
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

