Health Tips | గ్రీన్ యాపిల్‌తో మెరుగైన ఆరోగ్యం సొంతం
రోజుకో యాపిల్ తింటే వైద్యుడితో అవసరం ఉండదని చెబుతుంటారు. అయితే రెడ్ యాపిల్‌తో పోలిస్తే గ్రీన్ యాపిల్ మంచిదా అసలు ఏ యాపిల్ తీసుకోవాలనే సందేహాలు పలువురిలో తలెత్తుతుంటాయి.
న్యూఢిల్లీ : రోజుకో యాపిల్ తింటే వైద్యుడితో అవసరం ఉండదని చెబుతుంటారు. అయితే రెడ్ యాపిల్‌తో పోలిస్తే గ్రీన్ యాపిల్ మంచిదా అసలు ఏ యాపిల్ తీసుకోవాలనే సందేహాలు పలువురిలో తలెత్తుతుంటాయి. యాపిల్స్‌లో ఉండే విటమిన్లు, పాలీపెనాల్స్, యాంటీఆక్సిడెంట్లు రెండు రకాల యాపిల్స్‌లో పుష్కలంగా ఉన్నా రెండింటిలోనూ వేర్వేరు ఔషధ గుణాలున్నాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
రెండింటి మధ్య పెద్దగా వ్యత్యాసం లేకున్నా రెడ్ యాపిల్స్‌తో పోలిస్తే గ్రీన్ యాపిల్‌లో ఫైబర్ కొంచెం అధికంగా కార్బోహైడ్రేట్లు, చక్కెర కొంచెం తక్కువగా ఉంటుందని చెబుతున్నారు. యాంటీఆక్సిడెంట్లు, పాలీపెనాల్స్ మాత్రం రెడ్ యాపిల్‌లో అధికంగా ఉంటాయి. అలాగని గ్రీన్ యాపిల్స్ అందించే ఆరోగ్య ప్రయోజనాలు తక్కువేమీ కాదు. గ్రీన్ యాపిల్స్‌లో అధికంగా ఉండే ఫైబర్ కారణంగా మధుమేహ ముప్పు తక్కువగా ఉంటుంది.
ఇక గ్రీన్ యాపిల్స్‌లో ఎక్కువగా ఉండే ఓ తరహా ఫైబర్ పెక్టిన్ యాంటీబయాటిక్‌లా పనిచేసి ప్రేవులకు మంచి బ్యాక్టీరియాను అందిస్తుంది. వీటిలో ఉంఏ పైటోకెమికల్స్, పాలీపెనాల్స్ ద్వారా ఆస్త్మా లక్షణాల నుంచి స్వాంతన లభిస్తుంది. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరుస్తాయి. గ్రీన్ యాపిల్‌లో ఉండే విటమిన్లు, మినరల్స్ కారణంగా చర్మ సౌందర్యం కూడా మెరుగై చర్మం నిగారింపును సంతరించుకుంటుంది.
Read Today's Latest Health News in Telugu and Telugu News
- Tags
- fibre
- green apples
- Health news
RELATED ARTICLES
తాజా వార్తలు
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
Srisailam Dam | శ్రీశైలం డ్యామ్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
Yash | సర్దార్ డైరెక్టర్‌తో యశ్ సినిమా.. క్రేజీ టాక్ నిజమయ్యేనా..?
Ollie Robinson | పాకిస్థాన్‌పై నిప్పులు.. మూడేళ్లకు మళ్లీ సెంట్రల్ కాంట్రాక్ట్..!
Fake CISF DSP | ఎయిర్‌పోర్ట్‌లో ఉద్యోగాలు, చౌకగా ఐఫోన్లు ఇప్పిస్తానంటూ మోసం.. నకిలీ సీఐఎస్ఎఫ్ డీఎస్పీ అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

