సుఖ నిద్ర, చర్మ సౌందర్యానికి హామీనిచ్చే ‘ైగ్లెసిన్ సప్లిమెంట్’ వాడేవాళ్లు ఇటీవల పెరిగారు. కండల కోసం సప్లిమెంట్స్ వాడేవాళ్లు ఇప్పుడు అందం కూడా కోరుకుంటూ ఇటు మళ్లారు. సోషల్ మీడియా ప్రభావంతో ‘ైగ్లెసిన్ సప్లిమెంట్స్ వాడకం యువతలో పెరుగుతున్నది. దీనివల్ల కలిగే ప్రయోజనాలే తెలుసుకుంటున్నారు. సప్లిమెంట్స్ వాడటం అవసరమా? లేదా? అని మాత్రం తెలుసుకోవట్లేదు. వీటి దుష్ప్రభావాల గురించి పట్టింపే లేదు. ైగ్లెసిన్ సప్లిమెంట్స్ వాడేవాళ్లు వాటి వల్ల కలిగే ప్రభావాన్ని పూర్తిగా తెలుసుకుని వాడితేనే కోరుకున్న ప్రయోజనాలు నెరవేరతాయని వైద్యులు చెబుతున్నారు.
ైగ్లెసిన్ మానవ శరీరంలో జరిగే జీవక్రియల సమతుల్యతను కాపాడుతుంది. కొలాజెన్ ఉత్పత్తి, ప్రొటీన్ సంశ్లేషణ, నాడీ వ్యవస్థ మెరుగైన పనితీరుకు దోహదపడుతుంది. అందువల్ల ైగ్లెసిన్ సప్లిమెంట్ తీసుకుంటే హాయిగా నిద్రపడుతుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది. చర్మం అందంగా మారుతుంది. ఎముకల మధ్య ఉండే కండరాల వృద్ధి జరుగుతుంది. అందుకే ప్రమాదాల తర్వాత కండరాల వృద్ధికి దీనిని సిఫార్సు చేస్తారు. కొంతమంది ైగ్లెసిన్ సప్లిమెంట్లు అవసరమో లేదో కూడా నిర్ధారణ లేకుండా తీసుకుంటున్నారు. ప్రొటీన్ అధికంగా ఉన్న ఆహారం ద్వారా అందుతుందని చెప్పినా సప్లిమెంట్లే ఎంచుకుంటున్నారు. ఎంత పరిమాణంలో తీసుకోవాలో అవగాహన లేకపోవడంతో ఆశించిన మేలు జరగకపోగా సైడ్ ఎఫెక్ట్స్ బాధలు భరిస్తున్నారు. ైగ్లెసిన్ డోస్ ఎక్కువైతే దాని వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల కంటే అనారోగ్య సమస్యలే అధికమని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
పెద్దలకు ైగ్లెసిన్ సప్లిమెంట్లు అవసరమని భావిస్తే వైద్యులు కచ్చితమైన మోతాదుని సూచించి, సిఫార్సు చేస్తారు. ఒక్కొక్కరికి ఒక్కో మోతాదులో వాడమని చెబుతారు. ైగ్లెసిన్ సప్లిమెంట్ మోతాదు ఎక్కువైతే వికారం, కబుపుబ్బరం, అజీర్తి, విరేచనాలు, ఇతర జీర్ణ సమస్యలు వస్తాయి. ఈ లక్షణాలు ఉంటే వెంటనే డోస్ ఎక్కువవుతున్నట్టుగా గుర్తించాలి. ఈ సైడ్ ఎఫెక్ట్స్ దీర్ఘకాలం ఉండకుండా జాగ్రత్తపడాలంటే వెంటనే డోస్ తగ్గించాలి. ఈ సప్లిమెంట్స్ దీర్ఘకాలం వాడితే కిడ్నీ, కాలేయ సంబంధ వ్యాధులు వస్తాయి. కాబట్టి సప్లిమెంట్స్‌కి ప్రత్యామ్నాయంగా ైగ్లెసిన్ ప్రొటీన్ అధికంగా ఉండే మాంసాహారం, పాలు, పాల ఉత్పత్తులు, పప్పు ధాన్యాలను ఎక్కువగా తినాలి. రోజూ వ్యాయామం చేయాలి. ఒత్తిడి లేని జీవన శైలిని అలవర్చుకోవాలి. నిర్దుష్ట సమయంలో నిద్రపోవాలి. ఇలా చేస్తే ైగ్లెసిన్ సప్లిమెంట్స్ వాడాల్సిన అవసరం రాదు. వాడేవాళ్లూ మానేసి సైడ్ ఎఫెక్ట్స్‌ని తప్పించుకోవచ్చు.