సంతాన సాఫల్య విప్లవం
పిల్లలులేని లక్షలాది దంపతులను కలవరానికి గురిచేస్తున్న సమస్య.. వంధ్యత్వం. ఇలాంటి వారికి ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్.. IVF ఓ వరం. ఎందరికో సంతానాన్ని ప్రసాదించింది. ఎన్నో కుటుంబాల్లో ఆనందాలు నింపింది. బోలెడన్ని బోసి నవ్వులు కానుకగా ఇచ్చింది. జీవనరేఖగా మారింది. అందులోనూ, ఆరిజిన్ ఫెర్టిలిటీ.. తన నాలుగున్నర దశాబ్దాల ప్రస్థానంలో అమ్మతనానికి ఆసరా అందించిన ఉదాహరణలు అనేకం.
నాలుగున్నర దశాబ్దాల ఐవీఎఫ్ విజయ ప్రస్థానం
పిల్లలులేని లక్షలాది దంపతులను కలవరానికి గురిచేస్తున్న సమస్య.. వంధ్యత్వం. ఇలాంటి వారికి ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్.. IVF ఓ వరం. ఎందరికో సంతానాన్ని ప్రసాదించింది. ఎన్నో కుటుంబాల్లో ఆనందాలు నింపింది. బోలెడన్ని బోసి నవ్వులు కానుకగా ఇచ్చింది. జీవనరేఖగా మారింది. అందులోనూ, ఆరిజిన్ ఫెర్టిలిటీ.. తన నాలుగున్నర దశాబ్దాల ప్రస్థానంలో అమ్మతనానికి ఆసరా అందించిన ఉదాహరణలు అనేకం.
IVF సంతాన సాఫల్య చికిత్సలో మాకంటూ ఇంతటి గుర్తింపు, గౌరవం లభించడం వెనుక.. అంకితభావం కలిగిన వైద్యుల బృందం ఉంది. రీప్రొడక్టివ్ ఎండోక్రైనాలజిస్టులు, ఎంబ్రియోలజిస్టులు, ఫెర్టిలిటీ నర్సులు.. ప్రతి ఒక్కరి పాత్రా కీలకమే. మా బృందం అపార నైపుణ్యం, రోగుల పట్ల నిబద్ధత, ప్రేమ, సహానుభూతి, వ్యక్తిగత శ్రద్ధ .. అత్యద్భుత ఫలితాలనిస్తున్నాయి. అత్యాధునిక సంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ.. శాస్త్రీయంగా నిరూపితమైన వైద్య విధానాలనే ఎంచుకుంటున్నది ఆరిజిన్ ఫెర్టిలిటీ. IVF విధివిధానాల ఖరారు విషయంలోనూ సకల జాగ్రత్తలు తీసుకుంటున్నది. స్టేట్-ఆఫ్-ఆర్ట్ ఎక్విప్మెంట్, సాధికారికమైన టెక్నాలజీ సాయంతో అవరోధాలను అధిగమించి సంతాన సాఫల్యంలో ఆశించిన లక్ష్యాలను సాధించవచ్చు. దీనివల్ల IVF సక్సెస్ రేటు కూడా పెరుగుతుంది.
IVF ప్రస్థానం: నాలుగున్నర దశాబ్దాల విజయయాత్ర
IVF చరిత్రలో 1978వ సంవత్సరం ఓ మైలురాయి. ఆ ఏడాది.. ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ పద్ధతిలో ప్రపంచంలోనే తొలిబిడ్డ జన్మించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు.. లక్షలాది చిన్నారులు ప్రాణంపోసుకున్నారు. ఈ అత్యద్భుత సాంకేతికత.. అసిస్టెడ్ రీప్రొడక్షన్ రంగంలో పెనువిప్లవం. సంతానానికి నోచుకోని తల్లిదండ్రులకు టక్నాలజీ అందించిన వరం, చిమ్మచీకట్లో ఆశాదీపం. మొదట్లో ఇంప్లాంటేషన్ రేటు ప్రతి గర్భస్థ పిండానికి 5 శాతం మాత్రమే ఉండేది. ఇప్పుడది 50 శాతానికిపైగానే ఉంది. ఫెర్టిలిటీ సైన్స్‌లో అభివృద్ధి, ఆరిజిన్ లాంటి ఫెర్టిలిటీ సెంటర్ల చొరవ వల్లనే ఇదంతా సాధ్యమైంది.
టెక్నాలజీయే గుండెకాయ..
తొలినాళ్లతో పోలిస్తే.. IVF ల్యాబ్ అనూహ్యమైన మార్పులకు లోనైంది. అత్యాధునికమైన రూపాన్ని సంతరించుకుంది. ఆ ప్రక్రియలో భాగంగా.. సాంకేతిక ఎంపికలో, విధివిధానాల ఖరారులో ఎన్నో వడపాతలు జరిగాయి. అంతిమంగా ప్రపంచశ్రేణి సాంకేతిక స్థిరపడింది. ఎంబ్రియో కల్చర్ సిస్టమ్, నాణ్యతా నియంత్రణ పట్ల మేం తీసుకున్న అపారమైన శ్రద్ధ గొప్ప ఫలితాలను ఇస్తున్నది. గతంతో పోలిస్తే IVF ల్యాబ్ సాంకేతికతలో అనూహ్యమైన మార్పులు జరిగాయి. అత్యుత్తమ ఫలితాలు సాధించడానికి అవసరమైన అత్యున్నత వైద్య పరిజ్ఞానం మా దగ్గర ఉంది.
సంతాన చికిత్సలో విప్లవం
సంతాన చికిత్స రంగంలో పెను విప్లవం సృష్టించడమే లక్ష్యంగా.. కొందరు వైద్య, సాంకేతిక నిపుణులు తీసుకున్న చొరవ ఫలితమే ఆరిజిన్ ఫెర్టిలిటీ. అందుబాటు ధరల్లోనే సమగ్రమైన, ప్రపంచశ్రేణి పరిష్కారాన్ని అందించాలనే సంకల్పంతో ఆరిజిన్ ఫెర్టిలిటీ అండ్ రిసెర్చ్ సెంటర్ సాగిస్తున్న కృషి.. భారతీయ సంతాన సాఫల్య వైద్య రంగాన్ని అపారంగా ప్రభావితం చేస్తున్నది. మాతృత్వం కోసం మమ్మల్ని సంప్రదించే ప్రతి వ్యక్తినీ మేం ప్రత్యేకంగానే పరిగణిస్తాం. ప్రతి సమస్యనూ మేం కూలంకషంగా పరిశీలిస్తాం. వారివారి అవసరాలకు అనుగుణమైన వైద్య విధానాన్ని సిద్ధం చేస్తాం. ఫెర్టిలిటీ ట్రీట్మెంట్లోని ప్రతి దశలోనూ మీకు అత్యంత నాణ్యమైన సేవలు అందేలా సకల చర్యలూ తీసుకుంటున్నది నిబద్ధతకు మారుపేరైన మా నిపుణుల బృందం.
ఆరిజిన్ ప్రత్యేకతలు అనేకం..
- నిపుణుల బృందం: రీప్రొడక్టివ్ ఎండోక్రైనాలజిస్టులు, ఎంబ్రియోలజిస్టులు, ఫెర్టిలిటీ నర్సులు.. అత్యుత్తమ ఫలితాలకు భరోసా ఇస్తారు.
- అత్యాధునిక సాంకేతికత: గర్భధారణకు అత్యంత అనుకూల వాతావరణాన్ని సృష్టించడానికి మేం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని, ధ్రువీకృత వైద్య విధానాలను మేం ఉపయోగిస్తాం.
- ఆధారాలే ఆలంబనగా: మీకు తిరుగులేని ఫలితాలను అందించడమే మా బాధ్యత. ఆ ప్రయత్నంలో శాస్త్రీయమైన పద్ధతులనే ఎంచుకుంటాం. ధ్రువీకృత ఔషధాలనే సిఫారసు చేస్తాం.
ఆరిజిన్ వర్చువల్ నెట్వర్క్: ‘వన్ సైకిల్.. వన్ ఫ్యామిలీ’ సంతాన సాఫల్య చికిత్సలో ఇదే మా నినాదం. ఆరిజిన్‌తో సాగే మీ ప్రయాణంలో సాధికారమైన, కచ్చితమైన సమాచారాన్ని అందించడానికి మేము కృత్రిమ మేధ ఆధారితమైన సాంకేతికత పరిజ్ఞానాన్ని ఎంచుకున్నాం.
విలువల యాత్ర
IVF ఘనవిజయాల చరిత్రలో మేమూ భాగమైనందుకు గర్విస్తున్నాం.
‘వన్ ఫ్యామిలీ ఎట్ ఎ టైమ్’ నినాదంతో జీవితాలను మార్చే మహాయజ్ఞానికి మేము పునరంకితం అవుతున్నాం. IVF మరింత మందికి అందుబాటులోకి తీసుకురావడానికి, మరింత గొప్ప ఫలితాలను సాధించడానికి ఆరిజిన్ తనవంతు కృషి చేస్తూనే ఉంటుంది. ఆరోగ్య బీమా పాలసీలోనూ IVFను చేర్చగలిగితే మనందరి స్వప్నం మరింత చేరువ అవుతుందని మా సూచన. సంతాన సాఫల్య చికిత్సను అందుబాటు ధరలో అందించగలిగితే.. జీవితాలను మార్చగలిగే శక్తి ఉన్న IVF విధానాన్ని మరిన్ని కుటుంబాలు ఆశ్రయిస్తాయి.

Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | కరువు మండలాలు ప్రకటించడం తప్ప సహాయంపై చేతులెత్తేసిన రేవంత్ : మాజీ మంత్రి హరీష్‌రావు
PCOS | పీసీఓఎస్ సమస్య మహిళల్లో అసలు ఎందుకు వస్తుంది.. ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి..?
Rising Stars Asia Cup: రైజింగ్ స్టార్స్ ఆసియా కప్‌కు తిలక్ వర్మ కెప్టెన్సీ.. జట్టులో అభిషేక్, వైభవ్
RJD Somireddy | విద్యా ప్రమాణాల పెంపునకు సమష్టి కృషి చేయాలి : ఆర్జేడీ సోమిరెడ్డి
Sharad Pawar | శరద్ పవార్‌కు ఛాతిలో నొప్పి.. పూణె ఆసుపత్రిలో చేరిక, నిలకడగా ఆరోగ్యం
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

