న్యూఢిల్లీ : మనం రోజును ఎలా ప్రారంభిస్తామనే దానిపై రోజంతా మనం ఉల్లాసంగా ఉంటూ ఉత్తేజంగా పని చేసుకోగలగడం ఆధారపడి ఉంటుంది. ఆరోగ్యకరమైన ఆహారంతో కూడిన బ్రేక్‌ఫాస్ట్ (Breakfast) తీసుకుంటే రోజంతా చలాకీగా, హుషారుగా ఉండగలం. బ్రేక్‌ఫాస్ట్‌లో ఫాస్ట్‌ఫుడ్, మసాలాలతో నిండిన ఆహారం తీసుకుంటే ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది.
జంక్ ఫుడ్ స్ధానంలో ఆరోగ్యకర ప్రత్యామ్నాయాలతో కూడిన బ్రేక్‌ఫాస్ట్ తీసుకోవడం ద్వారా రోజును ప్రారంభించాలని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఉదయాన్నే పప్పు ధాన్యాలు, ప్రొటీన్స్, ఆరోగ్యకర కొవ్వులు, తాజా పండ్లు, కూరగాయాలతో చేసిన బ్రేక్‌ఫాస్ట్ రోజంతా మనం ఉత్సాహంగా ఉండేందుకు అవసరమైన అత్యవసర పోషకాలను అందిస్తుంది. ఇక ఉదయాన్నే ఈ పది రకాల ఆహార పదార్ధాలను బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకోరాదని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.
షుగరీ సిరిల్స్
పేస్ట్రీలు, డోనట్స్
ప్రాసెస్డ్ మాంసాహారం
పాన్‌కేక్స్
షుగరీ కాఫీ డ్రింక్స్
ప్రాసెస్డ్ ఫ్రూట్ జ్యూస్‌లు
స్టోర్స్‌లో లభించే స్మూతీస్
హై షుగర్ యోగర్ట్స్
బ్రేక్‌ఫాస్ట్ బార్స్
బ్రేక్‌ఫాస్ట్ శాండ్విచ్లు
Read More :
The Diary of a CEO | ఈ 14 సూత్రాలు పాటిస్తే మీ లైఫ్‌కి మీరే బాస్ అవ్వొచ్చు!