Citrus Fruits : ఆరోగ్యకర జీవనశైలిలో ఆహారంలో భాగంగా సిట్రస్ పండ్లు తీసుకోవడం ఎంతో మేలు చేస్తుంది. ఆరంజ్, లెమన్, జామ వంటి సిట్రస్ పండ్లుగా పిలిచే ఫ్రూట్స్ పోషకాలు మెండుగా ఉండి ఇమ్యూనిటీని బలోపేతం చేయడంతో పాటు జీర్ణక్రియ సాఫీగా సాగేలా చేస్తాయి.
అయితే ఈ తరహా సిట్రస్ పండ్లు ఆమ్లత్వాన్ని కలిగిఉండటంతో కొన్ని రకాల ఆహార పదార్ధాలతో కలిపి వీటిని తీసుకోవడం సరైంది కాదని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. నిర్ధిష్ట ఆహార పదార్ధాలతో కలిపి సిట్రస్ ఫ్రూట్స్ తీసుకుంటే గ్యాస్, కడుపుబ్బరం వంటి అనారోగ్య సమస్యలు వెంటాడతాయి.
సిట్రస్ పండ్లు శరీరానికి అందించే ఆరోగ్య ప్రయోజనాలను పూర్తిగా పొందాలంటే నిర్ధిష్ట ఆహార పదార్ధాలను వాటితో కలిపి తీసుకోరాదు. ఏ ఆహార పదార్ధాలతో కలిసి సిట్రస్ పండ్లను తీసుకోరాదో పరిశీలిస్తే..
పాలు, పాల ఉత్పత్తులు
రెడ్ వైన్
అధిక ప్రొటీన్‌తో కూడిన ఫుడ్స్
బొప్పాయి
పాస్తా, పొటాటో
Read More :