Cholesterol | కొలెస్ట్రాల్ తగ్గాలా..? ఈ ఫుడ్స్ తీసుకోండి..!
Cholesterol | శారీరక శ్రమ లేకపోవడం.. చేతికి దొరికిందేదో తినడం.. ఇవాల్టి రోజుల్లో సర్వసాధారణమై పోయింది. ఫలితంగా కొలెస్ట్రాల్ పెరిగిపోయి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.
Cholesterol | శారీరక శ్రమ లేకపోవడం.. చేతికి దొరికిందేదో తినడం.. ఇవాల్టి రోజుల్లో సర్వసాధారణమై పోయింది. ఫలితంగా కొలెస్ట్రాల్ పెరిగిపోయి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. శరీరంలో నిల్వయ్యే కొలెస్ట్రాల్ రక్తనాళాల్లో పేరుకుపోయి గుండెకు రక్తం సరఫరాకు అడ్డంగా నిలుస్తుంది. దాంతో గుండె ప్రమాదంలో చిక్కుకుంటుంది. ప్రస్తుత రోజుల్లో 20 ఏండ్లు దాటిన ప్రతీ ఒక్కరిలో కొలెస్ట్రాల్ పెరిగిపోతున్న సమస్య కనిపిస్తున్నది. ప్రాణం మీదకు రాక ముందే ఉపాయాలను తెలుసుకుని ఆచరించడం చాలా మంచిది.
ఏమవుతుంది..?
- కండ్లు మైకం కమ్ముతాయి.
- ఛాతీ భాగంలో నొప్పిగా ఉంటుంది.
- చిన్న పనికే అలసటగా అనిపిస్తుంది.
- అధిక రక్తపోటు కనిపిస్తుంది.
ఏమేం తినాలి..?
- అల్పాహారంలో సజ్జలు, జొన్నలు, ఓట్స్ తినాలి.
- ఫైబర్ అధికంగా ఉన్న ఆహారాలను తీసుకోవాలి.
- బీన్స్, చిక్కుడుకాయ, బచ్చలికూర వంటివి తినాలి.
- బెండకాయ, టమాట, బొప్పాయికి ప్రాధాన్యం ఇవ్వాలి.
- కోరిందకాయలు, బేరి పండ్లను పొట్టుతో తినాలి.
- తొక్క తీయకుండా ఆపిల్ తినాలి.
- సాల్మన్, మకెరేల్, హెర్రింగ్ రకం చేపలను తినాలి.
- అక్రోట్, బాదాం, అవిసె గింజలను తింటుండాలి.
- ఉప్పును తగిన మోతాదులో తీసుకోవాలి.
ఇంకేం చేయాలి..?
- శరీరం బరువును తగ్గించుకోవాలి.
- నిత్యం వ్యాయామాలు చేయాలి.
- ఈత, జాగింగ్ వంటివి అలవర్చుకోవాలి.
- ఏరోబిక్ వ్యాయామాలు మంచి ఫలితాన్నిస్తాయి.
- శరీరానికి అధిక విశ్రాంతినివ్వాలి.
- నలుగురితో నవ్వుతూ గడపాలి.
కొన్ని రకాల మందుల వలన కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించుకోవచ్చు. అయితే వైద్యుడి సలహా మేరకు మాత్రమే మందులను వాడాలి.
గమనిక: ఈ కథనం కేవలం పాఠకుల అవగాహన కోసమే అందిస్తున్నాం. ఆరోగ్యానికి సంబంధించి ఏ సమస్యకైనా వైద్యులను సంప్రదించడం శ్రేయస్కరం.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Road accident | భవానీ భక్తులతో వెళ్తున్న బొలెరో బోల్తా.. ఇద్దరు దుర్మరణం
No Relief For CJP | అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్‌లకు.. కస్టడీని పొడిగించిన కోర్టు
Mahabubnagar | ప్రైవేట్ భూముల్లో వీడియోలు.. రేవంత్ రెడ్డి అనుచరుడికి దేహశుద్ది
Bathukamma | లండన్‌లో ఘనంగా ‘టాక్-చేనేత బతుకమ్మ-దసరా’ సంబరాలు
Shahid Afridi: షాహిద్ అఫ్రిది మృతిచెందినట్లు సోషల్ మీడియాలో ఫేక్ పోస్టు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

