ఎంతోమందిని వేధిస్తున్న తీవ్ర సమస్య థైరాయిడ్. పోషకాహార లోపం, ఒత్తిళ్లు, అపసవ్య జీవనశైలి దీనికి ప్రధాన కారణం. మనం రోజూ తినే ఆహారానికి కూడా థైరాయిడ్ గ్రంథి పని తీరును మెరుగుపరిచే ఔషధ గుణాలున్నాయి. ఆ దినుసుల పరిచయం..
ఉసిరి: నారింజతో పోలిస్తే ఉసిరిలో విటమిన్-సి ఎనిమిది రెట్లు అధికం. అదే దానిమ్మతో పోలిస్తే పదిహేడు రెట్లు ఎక్కువ. విట మిన్-సి లోపం వల్ల థైరాయిడ్ గ్రంథి అధిక మొత్తంలో హార్మోన్లను స్రవిస్తుంది. దీనివల్ల హైపోథైరాయిడిజం వచ్చే ఆస్కారం ఉంది. ఉసిరితో థైరాయిడ్‌ను నియంత్రించవచ్చు.
పెసలు: థైరాయిడ్ లక్షణాల్లో ఒకటైన మలబద్ధకాన్ని పెసలు పారదోలతాయి. థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయకపోవడం వల్ల జీవక్రియ మందగిస్తుంది. దాన్ని మెరుగు పరిచేందుకు పెసలు సహకరిస్తాయి.
కొబ్బరి: థైరాయిడ్‌తో బాధపడే వారికి కొబ్బరి ఔషధంలా పని చేస్తుంది. ఇందులోని మీడియం చైన్ ఫ్యాటీ యాసిడ్లు, మీడియం చైన్ ట్రైగ్లిసరైడ్లు జీవక్రియ వేగాన్ని మెరుగుపరుస్తాయి. ఎండుకొబ్బరి, పచ్చి కొబ్బరి.. ఏ రూపంలో తీసుకున్నా థైరాయిడ్ సమస్యతో ఇబ్బంది పడేవారికి మేలే.
గుమ్మడి గింజలు గుమ్మడి గింజల్లోని జింక్, ఇతర విటమిన్లు శరీరం ఖనిజ లవణాలను శోషించుకునేందుకు తోడ్పడతాయి. సెలీనియం అపారంగా లభించే బ్రెజిల్ నట్స్ రోజుకు మూడు చొప్పున తిన్నా థైరాయిడ్ సమస్యకు దూరంగా ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు.