Health Tips | కాకర రసంతో ఆరోగ్యానికి మేలు
కాకర కాయ మన ఆరోగ్యానికి చేసే మేలు గురించి పెద్దలు ఎంత చెబుతున్నా కాకరలోని చేదును చూసి దానికి చాలామంది దూరంగా ఉంటారు.
న్యూఢిల్లీ : కాకర కాయ మన ఆరోగ్యానికి చేసే మేలు గురించి పెద్దలు ఎంత చెబుతున్నా కాకరలోని చేదును చూసి దానికి చాలామంది దూరంగా ఉంటారు. కాకర రసంతో పలు వ్యాధులను నియంత్రించడంతో పాటు శరీర ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. చేదుగా ఉంటుందనే కారణంతో కాకరను పక్కనపెట్టడం పొరపాటని అంటున్నారు. కాకర పోషకాల గనితో పాటు వ్యాధులను మన దరిచేరకుండా చూస్తుందని చెబుతున్నారు. కాకర రసంతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.
ఇమ్యూనిటీ బూస్టర్ : కాకర రసంలో ఉండే విటమిన్ సీతో చర్మ ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా రోగనిరోధక శక్తిని సమకూరుస్తుంది. శరీరంలో రోగనిరోధక వ్యవస్ధ బలంగా ఉంటే పలు వ్యాధులు, ఇన్ఫెక్షన్ల నుంచి అది మనల్ని కాపాడుతుంది.
మెరుగైన జీర్ణ వ్యవస్ధ : కాకరకాయ రసంలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. మనం తీసుకున్న ఆహారం జీర్ణమవడంతో పాటు మలబద్ధకాన్ని నివారించేందుకు ఫైబర్ తోడ్పడుతుంది. కడుపు నొప్పి, గ్యాస్ నివారణలోనూ కాకర కాయ రసం దివ్యౌషధంలా పనిచేస్తుంది.
అధిక బరువు నియంత్రణ : బరువు నియంత్రణలో కాకర కాయ రసం ఇతోధికంగా తోడ్పడుతుంది. కాకర జ్యూస్‌తో జీవక్రియల వేగం పెరిగి బరువు తగ్గేందుకు ఉపకరిస్తుంది. బరువు తగ్గడంతో ఆరోగ్యం మెరుగుపడుతుంది.
కొవ్వుకు చెక్ : గుండె జబ్బులకు దారితీసే చెడు కొలెస్ట్రాల్ (ఎల్డీఎల్)ను కాకర జ్యూస్ అదుపులో ఉంచుతుంది. కాకర రసంతో హృద్రోగాల బారినపడకుండా గుండెను పదిలంగా ఉంచుకోవచ్చు.
వ్యర్దాల తొలగింపు : కాకర రసాన్ని రోజూ తీసుకుంటే శరీరంలోని మలినాలను తొలగించే ప్రక్రియ వేగవంతమవుతుంది. కాకర రసం రక్తం, లివర్‌లో వ్యర్ధాలను తొలగించడమే కాకుండా శరీర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dada | బాలయ్య అభిమానులకు గుడ్ న్యూస్.. ‘దాదా’ ఫస్ట్ సాంగ్ రిలీజ్ డేట్ ఖరారు,ఎప్పుడంటే?
Hanuman Ansh | ఓటీటీలోకి రూ.440 కోట్ల బ్లాక్‌బస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ తేదీ ఖరారు!
Revanth Reddy | రేవంత్‌ను కలిసిన ఆంధ్రా అభిమాని.. ఏపీకి నీళ్లు వదిలినందుకు కృతజ్ఞతగా వచ్చాడని సెటైర్లు
Voter List | తెలంగాణ ఓటర్లకు ఎన్నికల సంఘం మరో ఛాన్స్.. ఓటు కోసం ఈ తేదీలోగా దరఖాస్తు చేసుకోండి!
IND vs NZ 2nd ODI | వర్షం కారణంగా 47 ఓవర్ల మ్యాచ్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న గిల్
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

