junk food during pregnancy | ప్రెగ్నెంట్ టైమ్ లో జంక్ ఫుడ్ తీసుకుంటున్నారా..? తాజా అధ్యయనం ఏం చెబుతోందంటే
junk food during pregnancy | గర్భధారణ సమయంలో కొన్ని నియమాలు కచ్చితంగా పాటించాలి. ముఖ్యంగా ఫుడ్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఏ మాత్రం తేడా జరిగినా.. అది పిండం పెరుగుదల, అభివృద్ధిపై ప్రభావం చూపిస్తుంది.
junk food during pregnancy | గర్భధారణ సమయంలో కొన్ని నియమాలు కచ్చితంగా పాటించాలి. ముఖ్యంగా ఫుడ్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఏ మాత్రం తేడా జరిగినా.. అది పిండం పెరుగుదల, అభివృద్ధిపై ప్రభావం చూపిస్తుంది. గర్భవతిగా ఉన్నప్పుడు మీరు తీసుకోబోయే ఆహారం.. శిశువు ఆరోగ్యం విషయంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. అయితే, కొందరు మహిళలు గర్భధారణ సమయంలో జంక్ ఫుడ్ ఎక్కువగా తింటుంటారు.
సాధారణంగా ప్రెగ్నెంట్ సమయంలో ఆహారం సహించదు. దీంతో అధిక పోషకాలు ఉన్న ఫుడ్ కంటే.. నోటికి రుచిగా అనిపించే కొవ్వు పదార్థాలు అధికంగా ఉండే పిజ్జా, బర్గర్లు, ఫ్రైడ్ రైస్, హాట్ చిప్స్ వంటివే ఎక్కువగా తింటుంటారు. అయితే, గర్భధారణ సమయంలో అల్ట్రా-ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకోవడం పిల్లల ఎదుగుదలపై తీవ్ర ప్రభావం చూపుతుందని తాజా అధ్యయనం తేల్చింది. తల్లులు అల్ట్రా-ప్రాసెస్డ్ ఫుడ్ (UPF) తినే సందర్భాల్లో శిశువుల తల పరిమాణం, తొడ ఎముక సైజు అసాధారణంగా పెరుగుతోందని పేర్కొంది.
బ్రెజిల్ (Brazil)లో 417 మంది తల్లుల ఆహార విధానాలు, పిల్లలపై దాని ప్రభావం గురించి జరిపిన పరిశోధన ఆధారంగా రూపొందించిన ఈ అధ్యయనం బ్రిటిష్ జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్ ( British Journal of Nutrition)లో ప్రచురించబడింది. ఇందులో జంక్ ఫుడ్ తిన్న గర్భిణుల్లో పిండం పెరుగుదల యొక్క అస్థిపంజర భాగాలపై ప్రతికూల ప్రభావం పడినట్లు తేలింది. గర్భిణులు అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ (UPF) ఎక్కువగా తింటే పిల్లల తల చుట్టుకొలత, తొడ ఎముక పొడవు ఎక్కువగా ఉంటున్నట్లు అధ్యయనం గుర్తించింది. అయితే శిశువుల పొట్ట భాగంపై మాత్రం ఎలాంటి ప్రభావాన్ని పరిశోధకులు కనుగొనలేదు. ‘అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ వినియోగం.. ప్రెగ్నెన్సీ చివరి దశలో పిండం ఎదుగుదల, శిశువు అస్థిపంజర నిర్మాణంపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. గర్భిణులు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటే, శిశువు శరీర పరిమాణం సక్రమంగా ఉండవచ్చు’ అని అధ్యయనం పేర్కొంది.
తల్లి కడుపులోని పిండం సరిగా అభివృద్ధి చెందేందుకు, సరైన ఆహార మార్గదర్శకాలను అనుసరించడం దీనికి పరిష్కారమని సీనియర్ శిశువైద్యులు డాక్టర్ అరుణ్ గుప్తా తెలిపారు. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు పాటించడం, గర్భధారణ సమయంలో UPFల వినియోగం మానేస్తే మంచి ఫలితాలు ఉంటాయని చెప్పారు. పిండం ఆరోగ్యంగా పెరగాలన్నా.. మంచిగా అభివృద్ధి చెందాలన్నా కాబోయే తల్లులు విటమిన్లు, ఖనిజాలతో కూడిన ఆహారాన్ని తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. ఆకుపచ్చని ఆకుకూరలు, విటమిన్ సి, కాల్షియం అధికంగా ఉండే ఆహారాలు తప్పనిసరిగా తీసుకోవాలని చెప్పారు.
అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ అనేవి, నేచురల్ ఫుడ్స్‌ను రసాయన భాగాలుగా (chemical constituents) పునర్నిర్మించి తయారు చేసే ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్. ఈ ప్రక్రియ సహజ ఆహారాల స్వభావాన్ని, ఫుడ్ మ్యాట్రిక్స్‌ను నాశనం చేస్తుంది.అంటే ఆహార పదార్థాల్లోని ఫైబర్ కంటెంట్‌ను తీసేసి, వాటికి కృత్రిమ చక్కెరలు, కొవ్వులు లేదా సాల్ట్స్ యాడ్ చేస్తారు. తర్వాత వాటికి ఎమల్సిఫైయర్లు, స్టెబిలైజర్లు, కలరింగ్ ఏజెంట్లు, విభిన్న ఫ్లేవర్స్ యాడ్ చేసి ఆకర్షణీయంగా మారుస్తారు. UPFలను ఎక్కువగా తీసుకుంటే అధిక బరువు, డయాబెటిస్, క్యాన్సర్లు, మధుమేహం గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంది. ఇది నాడీ వ్యవస్థపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతుంది. అన్నీ తెలిసి కూడా అంతా జంక్ ఫుడ్ తినేందుకే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. వీటిని అతిగా తిని అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నారు.
జంక్ ఫుడ్ గర్భిణిలపైనే కాదు సాధారణ మహిళలపైన కూడా ప్రతికూల ప్రభావం చూపుతోందని ఇప్పటికే అనేక అధ్యయనాల్లో తేలింది. ఫాస్ట్ ఫుడ్ లేదా జంక్ ఫుడ్ ఎక్కువగా తినే మహిళల్లో సంతానలేమి సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు నిపుణులు హెచ్చరిస్తున్నారు. అతిగా జంక్ ఫుడ్ తింటూ.. పండ్లు తక్కువగా తీసుకునే మహిళలకు గర్భం దాల్చే అవకాశాలు చాలా తక్కువ. ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో లభించే పిజ్జా, బర్గర్లు, ఫ్రైడ్ చికెన్, ఫ్రైడ్ ఆలూ చిప్స్, డోనట్స్, ఫ్రెంచ్ ఫ్రైస్, చాట్ లాంటి ఆహారంతో సంతాన సామర్థ్యం తగ్గుతుందని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఆకుకూరలు, పండ్లు, కూరగాయలు, చేపలు వంటి విటమిన్లు, ఖనిజాలు అధికంగా ఉన్న ఆహారం సంతాన సామర్థ్యాన్ని పెంచుతాయని చెబుతున్నాయి.
Also Read..
Study On Coffee | కప్పు కాఫీతో మెదడుకు స్పెషల్ బూస్ట్..!
Vitamin C | సీ విటమిన్‌తో ఇమ్యూనిటీ మాత్రమే కాదు.. హుషారూ.. సంతోషం కూడా..!
Puffed Rice | పేలాలను చిన్నచూపు చూస్తున్నారా? వాటి ఉపయోగాలు తెలిస్తే రోజూ అవే కావాలంటారు!!
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
Rains | బంగాళాఖాతంలో అల్ప పీడనం.. మూడు రోజులు వర్షాలు..!
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

