Puffed Rice | పేలాలను చిన్నచూపు చూస్తున్నారా? వాటి ఉపయోగాలు తెలిస్తే రోజూ అవే కావాలంటారు!!
Puffed Rice | పేలాలు చూసేందుకు.. మోసేందుకు పేలవంగా ఉన్నా.. శరీరానికి శక్తిని, ఆరోగ్యాన్ని ఇవ్వడంలో మాత్రం తిరుగులేదు. ఆకలితో ఉన్నవారికి వెంటనే కడుపు నింపి తక్షణ శక్తినిస్తాయి. కొవ్వు పెరుగుతుందేమో అనే టెన్షన్ అవసరం లేదు. ఎలాంటి అరమరికలు లేకుండా మురమురాల ఉపయోగాలు తెలుసుకుందామా!
Puffed Rice | పేలాలు చూసేందుకు.. మోసేందుకు పేలవంగా ఉన్నా.. శరీరానికి శక్తిని, ఆరోగ్యాన్ని ఇవ్వడంలో మాత్రం తిరుగులేదు. ఆకలితో ఉన్నవారికి వెంటనే కడుపు నింపి తక్షణ శక్తినిస్తాయి. కొవ్వు పెరుగుతుందేమో అనే టెన్షన్ అవసరం లేదు. ఎలాంటి అరమరికలు లేకుండా మురమురాల ఉపయోగాలు తెలుసుకుందామా!
శరీరానికి తక్కువ సమయంలో తక్కువ కేలరీలతో.. ఎక్కువ శక్తి రావాలంటే పేలాలను మించిన ప్రత్యామ్నాయం లేదంటున్నారు న్యూట్రిషనిస్టులు. ఇందులో గ్లూటెన్ శాతం కూడా తక్కువే. మధుమేహంతో బాధపడేవారు మొహమాటం లేకుండా లాగించవచ్చు. కేలరీలు, కొవ్వు తక్కువ.. పోషకాలు మాత్రం పుష్కలం. అందుకే, పిల్లలకు పేలాలతో చేసిన స్నాక్స్ ఇవ్వమని సలహా ఇస్తుంటారు పోషకాహార నిపుణులు. అధిక బరువుతో ఇబ్బంది పడేవారికి ఇది మంచి ఎంపిక. శరీరానికి కావాల్సిన శక్తిని ఇచ్చి కేలరీల విషయంలో పొదుపుగా ఉంటుంది. హైబీపీతో బాధపడేవారు చాలా ఆహార పదార్థాలకు దూరంగా ఉండాల్సి వస్తుంది. పేలాలను మాత్రం దూరం పెట్టాల్సిన అవసరం లేదు. పేలాలలో సోడియం తక్కువ. దీంతో రక్తపోటును నియంత్రించేందుకు దోహదం చేస్తాయి. పేలాల్లో యాంటీ ఆక్సిడెంట్లు అపారం.
మనలో రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. శరీరానికి కావాల్సిన క్యాల్షియం, ఫైబర్, ఐరన్, కార్బొహైడ్రేట్లను అందించి.. కండర పుష్టికి సాయపడతాయి. ఎముకలు కూడా బలంగా ఉంటాయి. పేలాలు తినడం తేలిక. జీర్ణం చేసుకోవడం కూడా తేలికే. అంతేకాదు.. ఉదర సంబంధ వ్యాధులకు చెక్ పెట్టి.. పొట్ట ఆరోగ్యాన్ని కాపాడతాయి. బఠానీలు, పల్లీలు, పుట్నాలతో కలిపి తీసుకుంటే రుచితోపాటు.. ఒంటికి మరిన్ని పోషకాలు అందుతాయి. పిల్లలు వద్దని మొండికేస్తే.. బెల్లంతో కలిపి పేలాల లడ్డూ తయారు చేసి ఇస్తే సరిపోతుంది. వాళ్లే ఇష్టంగా తింటారు.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
- Tags
- Murmura
- Puffed Rice
RELATED ARTICLES
తాజా వార్తలు
Netanyahu | అమెరికా భావి అధ్యక్షుడు మనకు శత్రువు కావచ్చు.. భారత్ చిన్న దేశమేమీ కాదు : నెతన్యాహు
Asian Para Games: ఏషియన్ పారా గేమ్స్.. షూటర్ మోనాకు గోల్డ్, అవనికి సిల్వర్
Ranabaali | ‘రణబాలి’ రికార్డుల మోత.. బతుకమ్మ వేడుకల్లో సందడి చేసిన విరోష్ జోడీ!
Bathukamma Celebrations | సింగపూర్‌లో ఘనంగా బతుకమ్మ – 2026 వేడుకలు
Jailer 2 | ‘జైలర్ 2’ బాక్సాఫీస్ సునామీ.. మూడు రోజుల్లోనే రూ.317 కోట్లకు పైగా వసూళ్లు!
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

