Pomegranate Leaves Water | దానిమ్మ పండ్లు మనకు ఏడాది పొడవునా అన్ని సీజన్లలోనూ లభిస్తాయి. చూసేందుకు ఈ పండ్లు ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. చాలా మంది ఈ పండ్లను ఎంతో ఇష్టంగా తింటుంటారు. అయితే దానిమ్మ పండ్లు మాత్రమే కాదు, దానిమ్మ ఆకులు కూడా ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. ఈ ఆకుల్లో ఎన్నో ఔషధ విలువలు ఉంటాయి. దానిమ్మ ఆకులను నీటిలో వేసి మరిగించి ఆ నీళ్లను తాగుతుంటే ఎంతో లాభం కలుగుతుందని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. ఈ నీళ్లను తాగడం వల్ల పలు వ్యాధులను నయం చేసుకోవచ్చని అంటున్నారు. దానిమ్మ ఆకుల్లోనూ పోషకాలు అధికంగా ఉంటాయి. ఇవి మనకు పోషణను అందించడంతోపాటు రోగాల నుంచి బయట పడేలా చేస్తాయి. దానిమ్మ ఆకుల నీళ్లను రోజూ ఒక కప్పు మోతాదులో తాగినా అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయని అంటున్నారు.
దానిమ్మ ఆకుల నీళ్లను తాగితే జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. ఈ ఆకుల్లో ఉండే సమ్మేళనాలు పొట్టలో ఉండే అసౌకర్యాన్ని తొలగిస్తాయి. కడుపు నొప్పి నుంచి బయట పడేలా చేస్తాయి. ఈ ఆకులతో తయారు చేసిన నీళ్లను తాగితే విరేచనాలు తగ్గుతాయి. అజీర్తి, గ్యాస్ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. దానిమ్మ ఆకుల నీళ్లను తాగడం వల్ల ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. మైండ్ రిలాక్స్ అవుతుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది. దీంతో నిద్ర చక్కగా పడుతుంది. రాత్రి పూట పడుకున్న వెంటనే గాఢ నిద్రలోకి జారుకుంటారు. నిద్రలేమి నుంచి బయట పడవచ్చు. దానిమ్మ ఆకుల్లో అనేక యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఈ ఆకులు యాంటీ ఇన్ ఫ్లామేటరీ, యాంటీ మైక్రోబియల్ గుణాలను కూడా కలిగి ఉంటాయి. అందువల్ల ఈ ఆకులతో తయారు చేసిన నీళ్లను తాగితే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. ముఖ్యంగా సీజనల్ గా వచ్చే దగ్గు, జలుబు, గొంతు నొప్పి వంటి సమస్యలు తగ్గిపోతాయి.
దానిమ్మ ఆకుల్లో ఉండే యాంటీ ఇన్ ఫ్లామేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఈ ఆకులతో పేస్ట్‌ను తయారు చేసి రాస్తుంటే చర్మంపై కలిగే అసౌకర్యం, దురద, గజ్జి, తామర, మొటిమలు వంటి చర్మ సమస్యలు తగ్గుతాయి. చర్మం వాపుల నుంచి ఉపశమనం లభిస్తుంది. చర్మంపై ఉండే ఎరుపుదనం పోతుంది. దానిమ్మ ఆకుల నీళ్లను తాగడం వల్ల శరీరంలోని టాక్సిన్లు బయటకు పోతాయి. దీంతో కణాలు పునరుత్తేజం చెందుతాయి. ముఖ్యంగా చర్మం మృదువుగా మారి కాంతివంతంగా ఉంటుంది. యవ్వనంగా కనిపిస్తారు. ఈ ఆకుల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. దీంతో కణాలకు జరిగే నష్టం నివారించబడుతుంది. శరీరంలో అంతర్గతంగా ఉండే వాపులు తగ్గిపోతాయి. దీంతో క్యాన్సర్, గుండె పోటు వంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా సురక్షితంగా ఉండవచ్చు.
ఈ ఆకులతో తయారు చేసిన నీళ్లను తాగుతుంటే షుగర్ లెవల్స్ నియంత్రణలో ఉంటాయి. ప్రీ డయాబెటిస్ లేదా టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారికి ఈ నీళ్లు మేలు చేస్తాయి. రోజూ ఈ నీళ్లను తాగుతుంటే షుగర్‌ను అదుపులో ఉంచుకోవచ్చు. దానిమ్మ ఆకులతో నీళ్లను తయారు చేసిన తరువాత గోరు వెచ్చగా ఉన్నప్పుడు సేవించాలి. అవసరం అనుకుంటే రుచి కోసం తేనె, నిమ్మరసం కలుపుకోవచ్చు. గర్భిణీలు, పాలిచ్చే తల్లులు ఈ నీళ్లను తాగకూడదు. చిన్నారులకు ఈ నీళ్లను తాగించకూడదు. అలర్జీలు ఉన్నవారు కూడా ఈ నీళ్లను తాగడం మంచిదికాదు. దానిమ్మ ఆకులు చాలా శుభ్రంగా ఉండేవి తీసుకుని నీళ్లను తయారు చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా ఈ నీళ్లను తాగితే అనేక లాభాలను పొందవచ్చు.