పాలు.. ఎంతో మేలు!
అమృతం ఎలా ఉంటుందని ఎవరైనా అడిగితే, పాలలా ఉంటుందని చెప్పేయవచ్చు. మాధుర్యానికి మాధుర్యం, ఆరోగ్యానికి ఆరోగ్యం! పాలు ఆరోగ్యాన్ని సంరక్షించే పరిపూర్ణ పౌష్ఠికాహారం. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకూ టీ, కాఫీ, బూస్ట్, హార్లిక్స్.. అంటూ అందరి పొట్టా నింపేస్తాయి. పెరుగు, మజ్జిగ, వెన్న, నెయ్యి.. అన్ని రూపాల్లోనూ శరీరానికి పోషకాలను అందిస్తాయి. ‘ప్రపంచ పాల దినోత్సవం’ సందర్భంగా పాలు చేసే మేలేమిటో తెలుసుకుందాం.

- రోజూ పాలు తాగాలని వైద్యులు సూచిస్తున్నారు. శరీరంలో కొన్ని రకాల హార్మోన్ల ఉత్పత్తికి అవసరమయ్యే కొవ్వుపదార్థాలు పాలద్వారా లభిస్తాయి. పాలలోని యాంటీ ఆక్సిడెంట్లు మెదడు కణాలు చురుగ్గా పని చేసేందుకు కావలసిన పోషకాలను అందిస్తాయి. రోజూ మూడు గ్లాసుల పాలు తాగేవారు వ్యాధులకు దూరంగా ఉంటారని పలు పరిశోధనల్లో తేలింది.
- పాలు తాగడం వల్ల బరువు పెరుగుతామన్నది అపోహ మాత్రమే. పాలలోని కొవ్వులు అధిక బరువును తగ్గించడంలో సాయపడుతాయి. నిద్ర లేమితో బాధపడేవారు, పడుకునే ముందు ఓ గ్లాసు పాలలో కాస్త తేనె కలుపుకొని తాగితే చక్కని ఫలితం ఉంటుంది.
- చిన్నప్పటినుంచీ పాలు తాగే అలవాటు ఉన్నవారిలో రొమ్ము క్యాన్సర్ వచ్చే ఆస్కారం చాలా తక్కువని ఓ అంచనా. పాలలోని క్యాల్షియం, సహజ కొవ్వులు క్యాన్సర్‌కు వ్యతిరేకంగా పోరాడుతాయి. పాలు తాగడం వల్ల కంటిచూపు మెరుగవుతుంది. జీర్ణ సమస్యలు తగ్గుతాయి.
- కరోనా సమయంలో రోగ నిరోధక శక్తిని పెంపొందించడంలో పాలు ముఖ్యపాత్ర పోషిస్తున్నాయి. పసుపు, మిరియాలు, శొంఠి వంటివి కలుపుకొని తాగడం వల్ల వైరస్, బ్యాక్టీరియా వంటి రోగకారకాలు నశిస్తాయి.
Read Today's Latest Health News in Telugu and Telugu News
- Tags
- drink-Milk
- milk
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

